New Smartwatch launch: రూ.2వేలలోపు ధరకే బ్లూటూత్ కాలింగ్‍తో స్మార్ట్‌వాచ్: పూర్తి వివరాలివే
Fire-Boltt Talk Ultra: బడ్జెట్ రేంజ్‍లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా వచ్చేసింది. సేల్ కూడా ఇప్పటికే మొదలైంది.
Fire-Boltt Talk Ultra Smartwatch: ఫైల్ బోల్ట్ టాక్ లైనప్‍లో మరో స్మార్ట్‌వాచ్ అడుగుపెట్టింది. తక్కువ ధరతోనే నయా ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. రౌండ్ షేప్ ఉన్న LCD డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది. 123 స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. హెల్త్ ఫీచర్లు ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో ఈ వాచ్ వస్తోంది. ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ట్రెండింగ్ వార్తలు
ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా ధర, సేల్
Fire-Boltt Talk Ultra Smartwatch price: ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఫైర్ బోల్ట్ వెబ్‍సైట్‍లో సేల్‍కు వచ్చేసింది. బ్లాక్, బ్లూ, రెడ్, గ్రే, పింక్, టీల్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తోంది. కాగా, దీన్ని ప్రత్యేక ధరగా ఫైర్ బోల్ట్ పేర్కొంటోంది.
ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Fire-Boltt Talk Ultra Smartwatch Specifications, Features: బ్లూటూత్ కాలింగ్‍కు ఈ ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. అంటే బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు కాల్స్ వస్తే.. వాచ్ ద్వారానే మాట్లాడవచ్చు. వాచ్ నుంచే కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఫోన్‍కు వచ్చే నోటిఫికేషన్లు కూడా వాచ్‍లోనే పొందవచ్చు. 240x240 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.39 ఇంచుల రౌండ్ షేప్ డిస్‍ప్లేను ఈ వాట్ కలిగి ఉంది.
రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్‍తో పాటు మొత్తంగా 123 స్పోర్ట్స్ మోడ్‍లకు టాక్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ హెల్త్ ఫీచర్లు ఉంటాయి.
Fire-Boltt Talk Ultra Smartwatch: ఫైర్ బోల్ట్ టాక్ అల్ట్రా వాచ్ ఫుల్ చార్జ్ పై ఏడు రోజుల బ్యాటరీ వస్తుందని ఈ కంపెనీ చెబుతోంది. రెండు గంటల్లో ఆ వాచ్ ఫుల్ చార్జ్ అవుతుందని పేర్కొంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్ ఈ వాచ్‍కు ఉంటుంది.