Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే-day trading guide for today stocks to buy or sell on monday 9th january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే

Stocks to buy today : ట్రేడర్స్​ జోన్​.. నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 09, 2023 07:46 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ (MINT)

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 132 పాయింట్లు కోల్పోయి 17,859 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​.. 452 పాయింట్ల నష్టంతో 59,900 వద్ద ముగిసింది. 419 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ.. 42,188కు చేరింది. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు అంశం.. అంతర్జాతీయంగా మార్కెట్​లకు గత వారం ప్రతికూల పరిస్థితులను సృష్టించింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 ప్రస్తుతం డౌన్​ట్రెండ్​లో ఉంది. నిఫ్టీ ఛార్ట్​లో శుక్రవారం ఏర్పడిన పెద్ద నెగిటివ్​ క్యాండిల్​.. డౌన్​ట్రెండ్​కు మరింత బలాన్ని చేకూర్చింది. 17,780 లెవల్​ సపోర్ట్​గా ఉంది. ఇది బ్రేక్​ అయితే.. మార్కెట్​ మరింత కిందకి పడొచ్చు!

Stock market news today : "నిఫ్టీ వీక్లీ ఛార్ట్​లో కూడా నెగిటివ్​ క్యాండిలే ఏర్పడింది. వీక్​నెస్​కు ఇది సంకేతం. 17,780 సపోర్ట్​గాను, 18,050- 18,100 లెవల్స్​ రెసిస్టెన్స్​గాను ఉంది. ఈ లెవల్స్​ వద్ద మార్కెట్​ ఎలా రియాక్ట్​ అవుతుందో చూడాలి," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి అన్నారు.

అమెరికా మార్కెట్​లు..

US Stock Markets news : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలతో ముగించాయి! ద్రవ్యోల్బణం తగ్గుతోందని, వడ్డీ రేట్ల పెంపు విషయంలో.. ఫెడ్​ అంత తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తల మధ్య.. మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు.

డౌ జోన్స్​ 2.13శాతం, ఎస్​ అండ్​ పీ 500 2.28శాతం, నాస్​డాక్​ 2.56శాతం మేర లాభపడ్డాయి.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 2902.46కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 1083,17కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : ఓఎన్​జీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 144, టార్గెట్​ రూ. 152- రూ. 155

బజాజ్​ ఆటో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3575, టార్గెట్​ రూ. 3725- రూ. 3750

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 584, టార్గెట్​ రూ. 625

ఎన్​సీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 88, టార్గెట్​ రూ. 102

హెచ్​సీఎల్​ టెక్​:- బై రూ. 1033, స్టాప్​ లాస్​ రూ. 1010, టార్గెట్​ రూ. 1070

గుజరాత్​ స్టేట్​ ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ (జీఎస్​ఎఫ్​సీ):- బై రూ. 145, స్టాప్​ లాస్​ రూ. 135, టార్గెట్​ రూ. 160

(గమనిక: ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel