Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. లాభాల కోసం ఈ స్టాక్స్​ బై చేయండి!-day trading guide for today stocks to buy or sell on monday 16th january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today Stocks To Buy Or Sell On Monday 16th January

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. లాభాల కోసం ఈ స్టాక్స్​ బై చేయండి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 16, 2023 07:19 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (PTI)

Stocks to buy today : అంతర్జాతీయంగా సానుకూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. నిఫ్టీ50.. 98 పాయింట్లు లాభపడి 17,956 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 303 పాయింట్లు పెరిగి 60,261 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 289 పాయింట్ల లాభంతో 42,371 వద్దకు చేరింది. ఐటీ సెక్టార్​లో అమ్మకాల జోరుతో సూచీలకు లాభాలు వచ్చాయి.

త్రైమాసిక ఫలితాలే కీలకం..

స్టాక్​ మార్కెట్​ నిపుణులు ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్​లలో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. అనేక సూచీలు.. కొన్ని నెలల గరిష్ఠాల వద్ద ట్రేడ్​ అవుతున్నాయి. ద్రవ్యోల్బణం డేటా అనుకున్న దాని కన్నా తక్కువ రావడంతో.. ఫెడ్​ వడ్డీ పెంపు తీవ్రత సైతం తగ్గుతుందని మదుపర్లలో అంచనాలు ఉండటం.. సానుకూల పవనాలకు కారణంగా తెలుస్తోంది.

Stock market news today : "దేశీయ స్టాక్​ మార్కెట్​లకు ఈ వారం కీలకంగా ఉండనుంది. పలు ఆర్థిక డేటాలతో పాటు దిగ్గజ సంస్థల నుంచి క్యూ3 ఫలితాలు వెలువడనున్నాయి. మార్కెట్​ కదలికలు వీటిపైనే ఆధారపడి ఉంటాయి. నిఫ్టీ.. 17,800- 18,500 మధ్యలో ట్రేడ్​ అవుతుంది. ఈ రెండింట్లో ఏది బ్రేక్​ అయినా.. మంచి మూమెంటం చూడవచ్చు," అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు సుగంధ సచ్​దేవ వెల్లడించారు.

"17,774 వద్ద నిఫ్టీ మళ్లీ సపోర్ట్​ తీసుకుంది. ఈ లెవల్​ ఎంతో కీలకమైనది మరోమారు రుజువైంది. ఎఫ్​ఐఐలు తీవ్రంగా అమ్మకాలు చేస్తున్నా.. నిఫ్టీ స్థిరంగా ఉండటం సానుకూల విషయం. డీఐఐలు కొనుగోళ్ల జోరు ఇందుకు కారణం. మరికొన్ని సెషన్స్​లో నిఫ్టీ 18,250 వరకు వెళ్లొచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ రీటైల్​ రీసెర్చ్​ హెడ్​ దీపక్​ జసాని పేర్కొన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2422.39కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1953.4కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై:-

NTPC share price target : ఎన్​టీపీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 164, టార్గెట్​ రూ. 172- రూ. 175

కెనెరా బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 316, టార్గెట్​ రూ. 335- రూ. 340

ఇండస్​ఇండ్​ బ్యాంక్​:- బై రూ. 1235, స్టాప్​ లాస్​ రూ. 1200, టార్గెట్​ రూ. 1290

Infosys share price target : ఇన్ఫోసిస్​:- బై రూ. 505, స్టాప్​ లాస్​ రూ. 1475, టార్గెట్​ రూ. 1570

రెయిన్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 183.50, స్టాప్​ లాస్​ రూ. 176, టార్గెట్​ రూ. 195

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం