Stocks to buy today : స్టాక్స్​ టు బై.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..-day trading guide for today 4 stocks to buy or sell on monday 13th february ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today: 4 Stocks To Buy Or Sell On Monday 13th February

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Feb 13, 2023 06:45 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే..
స్టాక్స్​ టు బై లిస్ట్​ ఇదే.. (PTI)

Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద స్థిరపడింది. 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17,856 వద్దకు చేరింది. ఇక 5 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 41,559 వద్ద ముగిసింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ డైలీ ఛార్ట్​లో చిన్న అప్పర్​, లోయర్​ షాడోతో కూడిన స్మాల్​ రేంజ్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇదొక డోజీ టైప్​ క్యాండిల్​ పాటర్న్​. డోజీ క్యాండిల్​ ఏర్పడితే రివర్సెల్​ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అయితే.. మార్కెట్​ ప్రస్తుతం రేంజ్​ బౌండ్​లో ఉండటంతో డోజీ వాల్యూ తగ్గిపోయింది.

Stock market news : "స్టాక్​ మార్కెట్​లు కన్సాలిడేషన్​ దశలో ఉన్నాయి. ఈ పాటర్నర్​ను నిఫ్టీ ఇంకొన్ని సెషన్స్​లో అప్​సైడ్​కి బ్రేక్​ చేసే అవకాశం ఉంది. 17,760 లెవల్స్​ వద్ద నిఫ్టీకి సపోర్ట్​ ఉంది. 18,000 అనేది కీలక రెసిస్టెన్స్​," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1458.02కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే డీఐఐలు రూ. 291.34కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​..

US Stock market investment in Telugu : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ముగిసింది. డౌ జోన్స్​ 0.5శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.22శాతం పెరిగాయి. నాస్​డాక్​ 0.61శాతం పడింది.

స్టాక్స్​ టు బై..

LT share price target : ఎల్​టీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2125, టార్గెట్​ రూ. 2200- రూ. 2225

HDFC bank share price target : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1625, టార్గెట్​ రూ. 1690- రూ. 1710

సుమిటోమో కెమికల్​ ఇండియా (సుమికెమ్​):- బై రూ. 450, స్టాప్​ లాస్​ రూ. 435, టార్గెట్​ రూ. 475

ఐజీఎల్​:- బై రూ. 442, స్టాప్​ లాస్​ రూ. 425, టార్గెట్​ రూ. 470.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు, సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel