Couple earns ₹12 lakh per day: నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్. ఈ దంపతుల సక్సెస్ స్టోరీ ఒక అద్భుతం. కంఫర్ట్ లైఫ్ లో కాదు.. చాలెంజింగ్ లైఫ్ లోనే థ్రిల్ ఉందని నమ్మి, ఆచరించి, విజయం సాధించిన జంట కథ ఇది.
బయోటెక్నాలజీ చదువుకున్న నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ లు కెరియర్ లో గొప్పగా సెటిల్ అయ్యారు. లక్షల్లో వేతనాలు. మొదట వారికి హరియాణాలో బీ టెక్ బయోటెక్నాలజీ చేస్తున్న సమయంలో పరిచయమైంది. ఆ తరువాత శిఖర్ హైదరాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఎంటెక్ చేశారు. సమోసా స్టార్ట్ అప్ ప్రారంభించే సమయానికి శిఖర్ బయోకాన్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్. నిధి కార్పొరేట్ జాబ్ లో జాయిన్ అయింది. జాబ్ మానేసే సమయానికి ఆమెది కూడా ఒక ఫార్మా కంపెనీలో రూ. 30 లక్షల ప్యాకేజీ. వారిద్దరి కుటుంబాలు కూడా సంపన్న కుటుంబాలే. నిధి తండ్రి ఫేమస్ లాయర్. శిఖర్ కుటుంబానికి చండీగఢ్, అంబాలాల్లో జ్యూయెలరీ షాప్ లు ఉన్నాయి.
చదువుకుంటున్న రోజుల నుంచి శిఖర్ కు సొంతంగా ఏదైనా బిజినెస్ చేాయాలని కోరిక. ముఖ్యంగా ఎస్బీఐ (SBI) బ్రాంచ్ ల ముందు సమోసాలు అమ్మే బిజినెస్ చేయాలనుకున్నాడు. కానీ నిధి ఆ ఆలోచనను మొదట్లో నవ్వుతూనే కొట్టిపారేసింది. సైంటిస్ట్ గా కెరియర్ పై దృష్టి పెట్టాలని సూచించింది. అలా ఐదేళ్లు గడచిపోయాయి.
ఆ తరువాత ఒక ఫుడ్ కోర్ట్ లో సమోసా కావాలని ఏడుస్తున్న ఒక చిన్న పిల్లవాడిని చూసిన తరువాత శిఖర్ తన ప్లాన్ ను మళ్లీ సీరియస్ గా తీసుకున్నాడు. బయోకాన్ లో ప్రిన్సిపల్ సైంటిస్ట్ జాబ్ మానేసాడు. బెంగళూరులో 2015లో ‘సమోసా సింగ్ (Samosa Singh)’ బిజినెస్ ను ప్రారంభించాడు. తొలి రోజుల్లో బిజినెస్ ను నడిపించడం కోసం చాలా కష్టపడ్డాడు. దంపతులిద్దరూ తమ పేరెంట్స్ నుంచి ఎలాంటి డబ్బు తీసుకోకుండా, తమ సేవింగ్స్ నుంచే ఈ ‘సమోసా సింగ్ (Samosa Singh)’ స్టార్ట్ అప్ ను ప్రారంభించారు. పెద్ద కిచెన్ ను ప్రారంభించడం కోసం డబ్బులు అవసరమై, తాము ఇష్టంగా కొనుక్కున్న అపార్ట్ మెంట్ ను అమ్మేశారు. ఆ డబ్బుతో ఒక ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని ‘సమోసా సింగ్ (Samosa Singh)’ బిజినెస్ ప్రారంభించారు.
క్రమంగా వారి ‘సమోసా సింగ్ (Samosa Singh)’ బిజినెస్ పాపులర్ అయింది. సమోసాల్లో కొత్త కొత్త వెరైటీలను రూపొందించారు. సమోసా కింగ్ సమోసాల్లో బటర్ చికెన్ సమోసా, కడాయి పన్నీర్ చికెన్ సమోసా చాలా పాపులర్. ఇప్పుడు వారు నెలకు కనీసం 30 వేల సమోసాలను అమ్ముతారు. వారి టర్నోవర్ రూ. 45 కోట్లు. అంటే వారి రోజువారీ ఆదాయం సుమారు రూ. 12 లక్షలు. ఇప్పుడు వారు తమ బిజినెస్ ను విస్తరించే ప్లాన్ లో ఉన్నారు.