Electric Bikes 2023: ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా.. ఈ నయా మోడళ్లపై ఓ లుక్కేయండి-are you planning to buy electric motorcycle in 2023 check these latest models ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Are You Planning To Buy Electric Motorcycle In 2023 Check These Latest Models

Electric Bikes 2023: ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా.. ఈ నయా మోడళ్లపై ఓ లుక్కేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 01, 2023 09:25 PM IST

Electric Motorcycles 2023: ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ బైక్‍‍ను కొనాలని అనుకుంటున్నారా.. అయితే కొన్ని ఆసక్తికర మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..

Electric Bikes 2023: ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా.. ఈ నయా మోడళ్లపై ఓ లుక్కేయండి (Photo: HT_Auto)
Electric Bikes 2023: ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా.. ఈ నయా మోడళ్లపై ఓ లుక్కేయండి (Photo: HT_Auto)

Electric Bikes 2023: ఎలక్ట్రిక్ టూ వీలర్స్ క్రమంగా చాలా పాపులర్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బైక్‍ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే 2023లో కొత్త ఎలక్ట్రిక్ బైక్‍లు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‍లను కొనాలనుకునే వారికి మరిన్ని మోడల్స్ అడుగుపెట్టనున్నాయి. అధునాతన ఫీచర్లు, ఎక్కువ రేంజ్‍తో కొన్ని వస్తున్నాయి. ఈ తరుణంలో 2023 తొలి అర్ధభాగంలో అందుబాటులోకి రానున్న టాప్ ఎలక్ట్రిక్ బైక్‍లు ఏవో ఇక్కడ చూడండి.

అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 (Ultraviolette F77)

అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 గత నెల లాంచ్ అయింది. ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే డెలివరీలు మాత్రం ఈనెల (జనవరి 2023) మొదలుకానున్నాయి. ఒరిజినల్, రెకాన్‍ వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. వేరియంట్లను బట్టి ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే 206 కిలోమీటర్లు లేదా 307 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. Also Read:అల్ట్రావయ్‍లెట్ ఎఫ్77 ధర, ఫీచర్ల పూర్తి వివరాలు

టార్క్ మోటార్స్ (Tork Motors)

ఈ నెలలో జరిగే ‘ఆటో ఎక్స్‌పో’లో టార్క్ మోటార్స్ ఓ కొత్త ఎలక్ట్రిక్ బైక్‍ను లాంచ్ చేయనుంది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న క్రాటోస్ మోటార్ సైకిల్‍కు ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‍ను తీసుకురానుంది. ప్రస్తుతం క్రాటోస్ మోడల్‍లో స్టాండర్డ్, ఆర్ వేరియంట్లు లభిస్తున్నాయి.

ఓబెన్ రోర్ (Oben Rorr)

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో రోర్ ఎలక్ట్రిక్ బైక్‍ల బుకింగ్‍లను ఓబెన్ మొదలుపెట్టింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రోర్ బైక్‍లను డెలివరీ చేయనుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఎకో మోడ్‍లో ఈ బైక్‍పై 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఓబెన్ వెల్లడించింది. 4.4 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీతో రానున్న ఈ బైక్.. గంటలకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‍ను కలిగి ఉంది.

మ్యాటర్ (Matter)

గేర్లను కలిగి ఉన్న తొలి ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్. ఇటీవలే ఈ బైక్‍ను ఆవిష్కరించింది అహ్మదాబాద్ బేస్డ్ స్టార్టప్ మ్యాటర్. ఇంకా ఈ మోటార్ సైకిల్ మోడల్ పేరును వెల్లడించలేదు. ఈ ఏడాది ఈ బైక్ బుకింగ్స్ మొదలుకానున్నాయి.

మ్యాటర్ బైక్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ రెండు కూడా..

ప్రముఖ సంస్థ హోండా (Honda) 2023 జనవరిలో ఓ నయా ఎలక్ట్రిక్ బైక్‍ను లాంచ్ చేయనుంది. అయితే ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందన్న విషయంపై స్పష్టత లేదు. కాగా, పాపులర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కూడా.. ఈ ఏడాది ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో దుమ్మురేపుతున్న ఓలా.. బైక్‍ల విభాగంలోనూ అడుగుపెట్టనుంది.

WhatsApp channel