Who is Ambani's to be DIL: అంబానీల కాబోయే కోడలు రాధిక గురించి ఈ విశేషాలు తెలుసా?-anant ambani radhika merchant engaged few things to know about new bridetobe ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Anant Ambani, Radhika Merchant Engaged. Few Things To Know About New Bride-to-be

Who is Ambani's to be DIL: అంబానీల కాబోయే కోడలు రాధిక గురించి ఈ విశేషాలు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Dec 29, 2022 09:30 PM IST

Who is Radhika Merchant? : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) చిన్న కోడలుగా అంబానీల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టబోతున్న రాధిక మర్చంట్(Radhika Merchant) భరత నాట్యంలో 8 ఏళ్ల పాటు శిక్షణ పొందారు.

కాబోయే దంపతులు అనంత్ అంబాానీ, రాధిక మర్చంట్
కాబోయే దంపతులు అనంత్ అంబాానీ, రాధిక మర్చంట్ (ANI )

News about Radhika Merchant: ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ నిశ్చితార్ధం రాధిక మర్చంట్ (Radhika Merchant) తో గురువారం రాజస్తాన్ లోని శ్రీనాథ్ జీ ఆలయంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. అంబానీల కాబోయే కోడలు రాధిక మర్చంట్ (Radhika Merchant) తండ్రి వీరేన్ మర్చంట్ (Viren Merchant) కూడా పారిశ్రామిక వేత్తనే.

ట్రెండింగ్ వార్తలు

Who is Radhika Merchant? : రాధిక మర్చంట్ గురించిన విశేషాలివే..

  • రాధిక మర్చంట్ తల్లిదండ్రులు శైల మర్చంట్, వీరేన్ మర్చంట్. ఫార్మా కంపెనీ ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత వీరేన్ మర్చంట్.
  • ముంబైలో, ఆ పై న్యూయార్క్ లో రాధిక మర్చంట్ (Radhika Merchant) విద్యాభ్యాసం కొనసాగింది. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలటికల్ సైన్స్, ఎకనమిక్స్ లో ఆమె డిగ్రీ చేశారు.
  • విద్యాభ్యాసం అనంతరం ముంబైలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘ఇస్ప్రవ’(Isprava) లో Radhika Merchant కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఈ సంస్థ లగ్జరీ హోమ్స్ కన్ స్ట్రక్షన్, డిజైన్ లలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.
  • ప్రస్తుతం రాధిక మర్చంట్ (Radhika Merchant) తమ సొంత ఫార్మా కంపెనీ ఎన్ కోర్ హెల్త్ కేర్(Encore Healthcare) లో డైరెక్టర్ గా ఉన్నారు.
  • రాధిక మర్చంట్ (Radhika Merchant) తన కాబోయే అత్తగారైన నీతా అంబానీ మాదిరిగానే భరత నాట్యం కళాకారిణి. రాధిక మర్చంట్ ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డాన్స్ అకాడమీలో గురు భావన ఠాకూర్ వద్ద దాదాపు 8 ఏళ్లు శిక్షణ పొందారు.
  • ఆమె భరత నాట్యం ఆరంగేట్రం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్(Jio world centre) లో ఈ సంవత్సరం అంబానీలే నిర్వహించారు.
  • అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) ల నిశ్చితార్ధం జరిగినట్లు 2019లోనే ఒక వార్త వచ్చింది.
  • గత కొన్ని సంవత్సరాలుగా రాధిక మర్చంట్, అనంత్ అంబానీ ప్రేమలో ఉన్నారని సమాచారం.

WhatsApp channel