Lexus ES300h| మరింత స్టైలిష్ లుక్‌తో సరికొత్తగా లాంచ్ అయిన లెక్సస్ లగ్జరీ సెడాన్-2022 lexus es300h made in india car launched with more style and updated features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  2022 Lexus Es300h Made In India Car Launched With More Style And Updated Features

Lexus ES300h| మరింత స్టైలిష్ లుక్‌తో సరికొత్తగా లాంచ్ అయిన లెక్సస్ లగ్జరీ సెడాన్

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 12:03 PM IST

లెక్సస్ నుంచి లగ్జరీ సెడాన్ కార్ Lexus ES300h ఇప్పుడు మరిన్ని మెరుగులు దిద్దుకొని కొత్తగా భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఆ వివరాలు చూడండి.

Lexus ES300h
Lexus ES300h

లగ్జరీ కార్ల తయారీదారు లెక్సస్ తన బ్రాండ్‌లోని Lexus ES300h కారును మరింత నవీకరించిన సరికొత్తగా విడుదల చేసింది. ఇది పూర్తిగా మేడ్- ఇన్- ఇండియా మోడల్. కొత్తగా తిరిగి లాంచ్ చేసిన Lexus ES300h కారు కూడా డిజైన్, స్టైలింగ్ అంశాలో అవుట్‌గోయింగ్ కారు మాదిరిగానే ఉంది. అయితే, 2022 ES 300hలో మైనర్ ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లో భాగంగా రివైజ్ చేసిన లెక్సస్ ఎంబ్లమ్‌ను ఇచ్చారు. ఇప్పుడు, హ్యాండ్స్-ఫ్రీ ఓపెనింగ్, బూట్ క్లోజింగ్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇంటీరియర్‌ లో కూడా సూక్ష్మమైన మార్పులను తీసుకువచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

2022 Lexus ES300h కారులో కొత్తగా వచ్చిన అప్‌డేట్‌లను పరిశీలిస్తే.. క్యాబిన్ చుట్టూ మరిన్ని స్టోరేజ్ స్పేస్‌లు, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, ఆన్-బోర్డ్ ఆపరేషన్, కంట్రోల్ కోసం లెక్సస్ డైనమిక్ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్, వైర్‌లెస్ Apple CarPlay , వైర్డు Android Autoతో అప్‌డేట్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్, కస్టమైజ్డ్ ప్రొఫైల్ ఫంక్షన్, హ్యాండ్స్-ఫ్రీ ట్రంక్, బూట్ ఆపరేషన్లు ఉన్నాయి. మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్ని అలాగే ఉంటాయి.

Lexus ES300h ఇంజిన్ సామర్థ్యం, ధరలు

Lexus ES300h కారులో 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 176bhp శక్తిని 221Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (E-CVT) జతచేసిన ఎలక్ట్రిక్ మోటార్‌ 118bhp పవర్ అవుట్‌పుట్, 202Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2022 ES 300h రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎక్స్ క్విసైట్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూం వద్ద రూ. 59.71 లక్షలు, లగ్జరీ వేరియంట్ ధర రూ, 65.81 లక్షలు.

ఈ లగ్జరీ సెడాన్ భారతీయ రహదారులపై Mercedes-Benz E-Class, BMW 5 సిరీస్, ఆడి A6 అలాగే వోల్వో S90 వంటి సెగ్మెంట్ కార్లతో పోటీ పడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం