Telugu News Updates 01 October 2022 : డీజీపీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ-andhra pradesh live news updates october 01 2022 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Live News Updates October 01 2022

డీజీపీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ(twitter)

Telugu News Updates 01 October 2022 : డీజీపీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ

01:19 AM ISTB.S.Chandra
  • Share on Facebook
01:19 AM IST

  • Today Telugu News Updates: అక్టోబర్ 01 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

Sat, 01 Oct 202204:36 PM IST

ఘోర ప్రమాదం….

యాపీలోని కాన్పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘతంపుర్​ ప్రాంతంలో శనివారం రాత్రి భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పది మంది భక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Sat, 01 Oct 202203:37 PM IST

డీజీపీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ

ఇవాళ తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని టీ కాంగ్రెస్‌ నేతలు కలిశారు. రాహుల్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌‌కు నేతలు అనుమతి కోరారు.  ఈనెల 24న నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

Sat, 01 Oct 202201:59 PM IST

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల…. 

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్‌–1 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. నవంబర్ 2వ తేదీని దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువుగా నిర్ణయించారు.

Sat, 01 Oct 202201:35 PM IST

గరుడ వాహనంపై శ్రీవారు….

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్త జనం భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయాయి.  శనివారం రాత్రి 7 గంటలకు స్వామి వారు  గరుడ వాహనంపై దర్శనమిచ్చారు.  గరుడ సేవకు 5 వేల మంది పోలీసులతో భద్రత నిర్వహించనున్నారు. మాడవీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.  దాదాపు మూడు లక్షల మంది శ్రీ‌వారి గ‌రుడ వాహ‌నసేవ‌ వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు.

Sat, 01 Oct 202201:08 PM IST

ప్రత్యేక రైళ్లు…. 

సికింద్రాబాద్ నుంచి తిరుపతి ( ట్రైన్ నెంబర్ 02764 ) మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ రైలు అక్టోబర్ 1న రాత్రి 8న గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌( రైలు నెంబర్ 02763)కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అక్టోబర్ 2న తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబ్‌నగర్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ మధ్య వీక్లీ ట్రైన్స్ నడపనుంది. రైలు నెంబర్ 07233 సికింద్రాబాద్ నుంచి యశ్వంత్‌పూర్ ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో రాకపోకలు కొనసాగిస్తుంది.రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే స్పెషల్ రైలు అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, అనంతపురం, హిందూపూర్, యలహంక స్టేషన్లలో ఆగుతుంది.

Sat, 01 Oct 202212:22 PM IST

తెలంగాణకు వర్ష సూచన…. 

ఈశాన్య, పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఇవాళ కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. హయత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, కోఠి, సుల్తాన్ బజార్, అసెంబ్లీ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో వాన పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

Sat, 01 Oct 202211:38 AM IST

నిమ్స్ లో జాబ్స్

NIMS Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌ నిమ్స్ (నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ సంస్థ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Sat, 01 Oct 202211:09 AM IST

షర్మిల ఫైర్….. 

తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులను ఆదుకోవడంతో నువ్వెక్కడ? నీ జాడెక్కడ అంటూ కేటీఆర్‌ని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారాన్ని గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు ఓ ఫొటోను కూడా జత చేశారు. ప్రతిరోజు విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు ఉద్యమంలో ఎక్కడున్నారంటూ కౌంటర్ విసిరారు. అయితే కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయంగా హీట్ ను పెంచిందనే చెప్పాలి. ఓవైపు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించగా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను జత చేస్తూ జవాబునిచ్చారు. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ కు వైఎస్ షర్మిల మాత్రం జవాబు గట్టిగా ఇస్తూనే కొన్ని ప్రశ్నాలను సంధించారు.

Sat, 01 Oct 202210:24 AM IST

నో పార్కింగ్ ప్లేస్….

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరిగే ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకొని శ్రీవారి భక్తులకు పోలీసులు కీలక అలర్ట్ ఇచ్చారు. తిరుమల నందు వాహనాల పార్కింగ్ ప్లేస్ లన్ని పూర్తిగా వాహనాలతో నిండినందున అలిపిరి టోల్గేట్ నుండి ప్రైవేట్ వాహనాలను నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు.

Sat, 01 Oct 202209:52 AM IST

ట్విట్టర్ హ్యాక్…!

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ట్విట్టర్ లో టీడీపీ అకౌంట్ కోసం టైప్ చేస్తే టైలర్ హాబ్స్ (Tyler Hobbs) అనే అకౌంట్ జైటీడీపీ హ్యాండిల్ తో ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు, ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీనిపై ఐటీడీపీ స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను అధికార వైసీపీ మద్దతు ఉన్న నికృష్టపు శక్తులు హ్యాకింగ్ చేశాయని ఆరోపించింది. త్వరలోనే టీడీపీ అకౌంట్ ను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.

Sat, 01 Oct 202209:48 AM IST

సీఐడీ నోటీసులు…!

బంజారాహిల్స్  ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు.  ఆ సమయంలో విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 

Sat, 01 Oct 202209:45 AM IST

ఆ స్థానాల్లో పోటీ…?

KCR National Party: విజయదశమి రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తారనే చర్చ జోరందుకుంది. తాజాగా ఆయన చేస్తున్న పర్యటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉండగానే... వచ్చే ఎన్నికల్లో 50 ఎంపీ సీట్లలో పోటీ చేయబోతున్నారనే న్యూస్ టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి.

Sat, 01 Oct 202209:00 AM IST

రాహల్ జోడో యాత్ర….

Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రసుత్తం కర్ణాటకలో కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగే యాత్ర తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ దాదాపు ఖరారైంది. అక్టోబర్ 24వ తేదీన తెలంగాణలోకి జోడో యాత్ర ఎంట్రీ కానుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇక తెలంగాణలో సాగే యాత్రలో భాగంగా.. పలు అధ్యాత్మిక ప్రాంతాలను రాహుల్ సందర్శించేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రముఖ దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని ద‌ర్శించుకొని స్వామి ఆశీస్సులు రాహుల్‌ పొంద‌నున్నారు. అటు త‌ర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌ మెద‌క్ చ‌ర్చికి వెళ్తారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న జ‌హంగీర్ ద‌ర్గాను కూడా సంద‌ర్శిస్తార‌ని భార‌త్ జోడో యాత్ర వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా బీజేపీ దేశంలో చేస్తున్న మ‌త విభ‌జ‌న రాజ‌కీయాల‌కు గట్టి సమాధానం ఇచ్చిన‌ట్టువుతుంద‌ని కాంగ్రెస్ అంచ‌నాలు వేసుకుంటుంది.

Sat, 01 Oct 202207:27 AM IST

మోహినీ అలంకారంలో ఆకట్టుకున్న కళాప్రదర్శనలు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో ఐదో రోజైన శ‌నివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 24 క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చాయి.

Sat, 01 Oct 202207:27 AM IST

మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

Sat, 01 Oct 202207:26 AM IST

అన్నదానానికి విరాళం

శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ట్రస్టు కు విజయవాడకు చెందిన నందిని ఫార్మా అధినేత శ్రీ జక్కా సీతారామాంజనేయులు శనివారం రూ 10 లక్షల విరాళం అందించారు . క్యాంపు కార్యాలయంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు చెక్కు ను అందజేశారు .దాత ను చైర్మన్ సుబ్బారెడ్డి అభినందించారు

Sat, 01 Oct 202205:36 AM IST

సిఎం కాన్వాయ్‌ నుంచి జారిపడిన మహిళ

జనగామ జిల్లా పెంబర్తి వద్ద సిఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ నుంచి మహిళా పోలీస్‌ అధికారి వాహనం నుంచి జారి పడిపోయారు. ఈ ఘటనలో పోలీస్ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీస్ అధికారి కిందపడిపోవడంతో వెంటనే కాన్వాయ్ ఆపి ఆమెను సహచరులు వాహనంలో ఎక్కించారు.

Sat, 01 Oct 202205:27 AM IST

దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభం

దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభం అయ్యాయి. 5జీ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ సేవలు ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‍లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి నుంచి ఈనెల 4 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలోనే 5జీ సేవలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటూలోకి రానున్నాయి.

Sat, 01 Oct 202205:18 AM IST

మోహిని అవతరంలో వేంకటేశ్వరుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. క్షీర సాగర మథనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను మాయచేసి, సురులకు అమృతం పంచినట్లు పురాణ గాథ. ప్రపంచమంతా మాయా విలాసమని, తన భక్తులు కానివారు మాయాధీనులు కాకతప్పదని స్వామివారు బోధించారు. మాయా జగత్తు నుంచి భక్తులను బయటపడేయటమే మోహినీ రూపం పరమార్థం. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు.

Sat, 01 Oct 202205:06 AM IST

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా తెనాలి రోడ్డులోని సంఘం జాగ్లర్లముడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోని  లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. కూలీ పనుల కోసం సంగం జాగర్ల ముడి నుంచి తెనాలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

Sat, 01 Oct 202204:09 AM IST

గ్రూప్‌ 1 మినహా మిగిలిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు

గ్రూప్‌ 1 మినహా మిగిలిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీపీఎస్సీ సహా అన్ని ప్రభుత్వ నియామక సంస్థలకు ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రకటించారు.  గ్రూప్ -1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు.  గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  గ్రూప్-1లో అత్యున్నత ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

Sat, 01 Oct 202204:09 AM IST

శ్రీమహాలక్ష్మీగా అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై ఆరోరోజు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.  అమ్మవారి దర్శనానికి ఉదయం 4 నుంచి భక్తులు బారులుతీరారు.   విజయవాడ దుర్గగుడిలో కుంకుమ పూజలు, చండీహోమం నిర్వహిస్తున్నారు.  ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో  భక్తులు పాల్గొంటున్నారు.  రేపు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు.  అమ్మవారికి ముఖ్యమంత్రి  పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Sat, 01 Oct 202204:09 AM IST

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది.  శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.  నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.85 కోట్లుగా ఉంది.  75,382 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.  31,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Sat, 01 Oct 202204:09 AM IST

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.  సెర్ప్ సీఈఓగా  ఎం.గౌతమి బదిలీ అయ్యారు. ఎండి ఇంతియాజ్ ను భూపరిపాలన శాఖ అదనపు చీఫ్ కమిషనర్ గా నియమించారు.  ఇంతియాజ్ కు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గాను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపి డైరీ డెవలప్మెంట్ కోపరిటివ్ ఫెడరేషన్ ఎండిగా  అహ్మద్‌బాబును నియమించారు.  అమూల్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా , సహకార శాఖ కమిషనర్, ఏపీ లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్ సీఈఓ గా బాబు కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.