Mercury transit: మే నెలలో అద్భుతాలు చేయబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి రెట్టింపు లాభాలు-mercury transit two time in may month these zodiac signs will earn lot of money ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: మే నెలలో అద్భుతాలు చేయబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి రెట్టింపు లాభాలు

Mercury transit: మే నెలలో అద్భుతాలు చేయబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి రెట్టింపు లాభాలు

Gunti Soundarya HT Telugu
Apr 30, 2024 12:21 PM IST

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో రెండు సార్లు తన కదలిక మార్చుకోబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి రెట్టింపు లాభాలు కలుగుతాయి. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

మే నెలలో అద్భుతాలు చేయబోతున్న బుధుడు
మే నెలలో అద్భుతాలు చేయబోతున్న బుధుడు

Mercury transit: గ్రహాల సంచారం వల్ల మే నెల చాలా ప్రత్యేకమైనదిగా నిలవనుంది. ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకుంటున్నాయి, ధనం, తెలివితేటలు, విచక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి వాటికి ప్రతీకగా బుధ గ్రహాన్ని భావిస్తారు.

గ్రహాల రాకుమారుడు బుధుడు మే నెలలో రెండుసార్లు తన రాశి చక్రాన్ని మారుస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 10న బుధుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. మే 30 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత మే 31వ తేదీ మధ్యాహ్నం వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. మే నెలలో బుధుడి సంచారం కొన్ని రాశుల వారికి రెట్టింపు మేలు చేస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతం అవుతాయి. అదృష్టం లభిస్తుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. బుధుడు మేష రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.

మేష రాశి

మేష రాశిలో బుధుడి ప్రవేశంతో వీరికి బ్రహ్మాండమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వ్యాపారులకు మేలు జరుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. అకస్మాతగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తుంది. ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది. అందరిలోనూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. మీ వ్యక్తిత్వానికి అందరూ ఆకర్షితులవుతాయి.

సింహ రాశి

మే నెలలో బుధుడి సంచారం రెండు సార్లు జరగడం వల్ల సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. వ్యాపారం విస్తరించుకుంటారు. సంపద పెరుగుదలకు కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతాధికారులు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం శుభదాయకంగా ఉంటుంది. కెరీర్ లో ప్రమోషన్ పొందేందుకు అనేక ముఖ్యమై పనులు చేపడతారు. ఉద్యోగానికి సంబంధించి విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది.

తులా రాశి

బుధుడి సంచారం ప్రభావంతో తులా రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. విదేశాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. బుధుడి శుభ ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి

బుధుడి సంచారం వృషభ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. మే నెల చివరి రోజు బుధుడు మేష రాశిని వీడి వృషభ రాశిలోకే ప్రవేశిస్తాడు. ఫలితంగా ఈ సమయంలో మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. మీ పని తీరు మెరుగుపడుతుంది.

WhatsApp channel