Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటించండి.. విజయం మీదే-do follow these remedies on hanuman jayanti as per your zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటించండి.. విజయం మీదే

Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటించండి.. విజయం మీదే

Gunti Soundarya HT Telugu
Apr 19, 2024 12:18 PM IST

Hanuman jayanti 2024: హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం కొన్ని మంత్రాలు పఠిస్తూ పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల విజయం వరిస్తుంది. ధైర్య సాహసాలు మెరుగుపడతాయి.

హనుమాన్ జయంతి రోజు పఠించాల్సిన మంత్రాలు
హనుమాన్ జయంతి రోజు పఠించాల్సిన మంత్రాలు (pexels)

Hanuman jayanti 2024: బలం, ధైర్యం, విధేయతకు ప్రతీకగా హనుమంతుడిని భావిస్తారు. ఏప్రిల్ 23వ తేదీ హనుమాన్ జయంతి జరుపుకొనున్నారు.

ఈ పవిత్రమైన రోజున హనుమంతుడికి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. బలం, ధైర్యం, రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. హనుమాన్ జయంతి నాడు మీ రాశి ప్రకారం కొన్ని నిర్దిష్టమైన పరిహారాలు పాటించడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం లభిస్తుంది.

మేష రాశి

మేష రాశి జాతకులు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ధైర్యం, సామర్థ్యాలు మెరుగుపడతాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అధిగమించేందుకు, విజయం సాధించేందుకు హనుమంతుడి ఆశీస్సులు మీ వెంట ఉంటాయి.

వృషభ రాశి

హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి సింధూరం, బెల్లం సమర్పించాలి. భజరంగ బాన్ పఠించాలి. ఈ పరిహారం పాటిస్తే జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత శ్రేయస్సు మెరుగుపడుతుంది.

మిథున రాశి

హనుమాన్ అష్టకాన్ని 108 సార్లు జపించాలి. అలాగే హనుమంతుడికి పెసరపప్పు సమర్పించాలి. ఈ పరిహారం పాటిస్తే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

కర్కాటక రాశి

హనుమంతుడికి పాలు, తేనే సమర్పించి హనుమాన్ గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో మానసిక స్థిరత్వం, సామరస్యం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోగలుగుతారు.

సింహ రాశి

హనుమాన్ మంత్రమైన ‘ఓం హనుమతే నమః’ 108 సార్లు పఠించాలి. అలాగే ఎర్రచందనాన్ని సమర్పించాలి. ఈ పరిహారం మీలోని నాయకత్వ లక్షణాలను మెరుగుపరుస్తుంది. మంచి విజయాలను తీసుకొస్తుంది. విశ్వాసం, తేజస్సును పెంచుతుంది.

కన్యా రాశి

హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రాన్ని 12సార్లు పఠించి పసుపు పుష్పాలు హనుమంతుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ మనసుకి హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలతో లక్ష్యాలను సాధించగలుగుతారు.

తులా రాశి

హనుమాన్ హారతిని పఠించాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల బందువులు, స్నేహితులతో ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగిస్తారు. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చిక రాశి

హనుమాన్ కవచాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుండి మీకు రక్షణ కలుగుతుంది. శక్తి, ధైర్యం లభిస్తుంది.

ధనుస్సు రాశి

హనుమాన్ బాహుక్ జపించాలి. అంజనేయుడికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించాలి. ఈ పరిహారంతో మీకు విజయాలు లభిస్తాయి. అదృష్టాన్ని తీసుకొస్తుంది.

మకర రాశి

హనుమాన్ చాలీసా నియమ నిబంధనలు అనుసరిస్తూ జపించాలి. అలాగే ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే వృత్తిపరమైన జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి. కెరీర్ లో లక్ష్యాలను సాధించగలుగుతారు.

కుంభ రాశి

హనుమాన్ అష్టోత్తర శతనామావళి 108 సార్లు పఠించి హనుమంతుడికి నీలిరంగు పుష్పాలు సమర్పించాలి. ఇలా చేస్తే మనసు శుద్ది అవుతుంది.

మీన రాశి

హనుమన్ స్తోత్రాన్ని పఠించి హనుమంతుడికి తెలుపు రంగు పుష్పాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శాంతి, సామరస్యం నెలకొంటాయి. ఆధ్యాత్మిక వృద్ధి సాధిస్తారు. అంతర్గత ఆనందాన్ని పొందుతారు.

 

 

Whats_app_banner