Vaishakha month: వైశాఖ మాసంలో ఈ తులసి పరిహారాలు పాటించండి.. మీ అదృష్టానికి, ఆదాయానికి తిరుగే ఉండదు-follow these tulsi remedies in the month of vaisakh your luck and income will not change ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vaishakha Month: వైశాఖ మాసంలో ఈ తులసి పరిహారాలు పాటించండి.. మీ అదృష్టానికి, ఆదాయానికి తిరుగే ఉండదు

Vaishakha month: వైశాఖ మాసంలో ఈ తులసి పరిహారాలు పాటించండి.. మీ అదృష్టానికి, ఆదాయానికి తిరుగే ఉండదు

Gunti Soundarya HT Telugu
May 01, 2024 04:42 PM IST

Vaishakha month: వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైనది. అటువంటి మాసంలో తులసి మొక్కకు సంబంధించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ అదృష్టానికి తిరుగే ఉండదు. మీ ఆదాయానికి అదుపు ఉండదు.

వైశాఖ మాసంలో ఈ తులసి పరిహారాలు పాటించండి
వైశాఖ మాసంలో ఈ తులసి పరిహారాలు పాటించండి

Vaishakha month: మరికొద్ది రోజుల్లో చైత్ర మాసం ముగిసి వైశాఖ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసమని చెప్తారు. అందుకే విష్ణువుకి ఇష్టమైన తులసి మొక్కను పూజించడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. మీ ఆదాయానికి అడ్డు ఉండదు.

హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని చెబుతారు. విష్ణుమూర్తికి అంకితం చేసిన ఏకాదశి రోజు తులసి మొక్కను పూజిస్తే కుటుంబంలో సంతోషం కలుగుతుంది. వాస్తు శాస్త్రంలో కూడా తులసి మొక్క సానుకూల శక్తిని ఇస్తుందని ఎక్కువగా నమ్ముతారు.

వైశాఖ మాసంలో విష్ణువును ఆరాధించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో “ఓం మాధవాయ నమః” అనే మాత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో విష్ణుమూర్తితో పాటు తులసిని పూజించడం వల్ల మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ మాసంలో తులసి మొక్కకు కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మీ పూజా ఫలితం రెట్టింపు అవుతుంది. సానుకూల ఫలితాలు తెచ్చే అవకాశం బలపడుతుంది. ఈ పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆదాయానికి, అదృష్టాన్నికి అడ్డు ఉండదు.

వైశాఖ మాసంలో తులసి పరిహారాలు

గురువారం విష్ణుమూర్తికి అంకితం చేసిన రోజు. అందుకే వైశాఖ మాసంలో ప్రతీ గురువారం తులసిని పూజించడం మరింత పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఈ సమయంలో స్త్రీలు పూజా నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలి. గురువారం నాడు స్త్రీలు స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర పిండి దీపం వెలిగించాలి. తర్వాత ఒక గిన్నెలో ఏడు పసుపు కొమ్ములు, ఒక బెల్లం ముక్క తీసుకొని అందులో ఏడు గ్రాముల పప్పు వేసి మొక్క ముందు ఉంచాలి.

సంపద కోసం

పూజ సమయంలో ఒక కుండలో నీరు తీసుకొని తులసి, విష్ణు మూర్తిని ధ్యానిస్తూ తులసి మొక్కకు సమర్పించాలి. ఆ నీటిలో కొద్దిగా పసుపు వేసి మీ మనసులో కోరికను చెప్పుకుంటూ తులసి మొక్కకు నీరు సమర్పించాలి. ఈ సమయంలో “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల సంపద ప్రవాహం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి

ఈ చెట్టుతో కలిపి తులసిని పూజించాలి

తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొనేందుకు ఉదయం, సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలీ. ఉదయం స్నానం చేసిన తర్వాత నీరు సమర్పించాలి. వైశాఖ మాసంలో తులసితో పాటు రావి చెట్టుని పూజించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు.

తులసి పరిహారాలు

ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఐదు తులసి ఆకులు తీసుకుని వాటిని పట్టుకుని రావి చెట్టు దగ్గర ఐదుసార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తున్న సమయంలో మీ మనసులో కోరికలను చెప్పుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తొలగిపోతాయి.

తులసి మొక్క జాగ్రత్త

నిత్యం తులసిని పూజించడం, నీటిని నైవేద్యంగా సమర్పించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఆదివారం, ఏకాదశి రోజు తులసి మొక్కకు పొరపాటున కూడా నీరు పెట్టకూడదు. ఆరోజు తులసి మాత విష్ణుమూర్తి కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. మీరు నీరు సమర్పించడం వల్ల ఉపవాసం భగ్నమవుతుంది. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఈ రెండు రోజులు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. అలాగే తులసి ఆకులు తెంపకూడదు.

 

WhatsApp channel