Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి-know why you shouldnt drink juices on an empty stomach ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
May 02, 2024 04:30 PM IST

Empty Stomach: వేసవిలో చల్ల చల్లని జ్యూసులు తాగేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అయితే ఖాళీ పొట్టతో మాత్రం జ్యూసులు తాగకూడదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకోండి.

పండ్ల రసాలు
పండ్ల రసాలు (pixabay)

Empty Stomach: ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున ఖాళీ పొట్టతో అన్ని రకాల ఆహారాలు తినకూడదు. ముఖ్యంగా ఖాళీ పొట్టతో జ్యూసులు తాగడం మంచిది కాదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పండ్ల రసాలు ఆరోగ్యానికి అంతా మంచే చేస్తాయి కదా అనుకోవచ్చు. కానీ ఖాళీ పొట్టతో మాత్రం పండ్ల రసాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వివరిస్తున్నారు.

పండ్ల రసాలు ఎందుకు తాగకూడదు?

ఖాళీ పొట్టతో పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఎందుకంటే పండ్లలో ఫైబర్ ఉంటుంది. కానీ పండ్ల రసాలలో మాత్రం ఫైబర్ ఉండదు. దీనివల్ల పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలో నెమ్మదిగా పెరుగుతాయి. అదే జ్యూసుల రూపంలో తాగితే మాత్రం వేగంగా పెరుగుతాయి. కాబట్టి పండ్లను ఖాళీ పొట్టతో తినొచ్చు, కానీ జ్యూసులను మాత్రం ఖాళీ పొట్టతో తాగకూడదు.

ఖాళీ పొట్టతో పండ్ల రసాన్ని తాగడం వల్ల దాహం అధికమవుతుంది. ఎందుకంటే పండ్ల రసాలు తాగిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీని వల్ల తీవ్ర అలసట అనిపిస్తుంది. అప్పుడు శరీరం శక్తి కోసం మరిన్ని కేలరీలను కోరుతుంది. దీనివల్ల దాహం వేయడం, ఆకలి వేయడం వంటివి జరుగుతుంది.

పండ్లు మంచివే కానీ...

ఖాళీ పొట్టతో జ్యూసులు వంటివి తాగడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. పండ్ల రసంలో ఆమ్లత్వం ఉంటుంది. ఇది దంతాలపై ఉన్న ఎనామిల్‌ను క్షీణించేలా చేస్తుంది. దీనివల్ల దంత క్షయం వంటివి వస్తాయి. జీర్ణ క్రియకు ఫైబర్ చాలా అవసరం. పండ్లలో ఫైబర్ ఉంటుంది, కానీ పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. కాబట్టి జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆమ్లత్వం వంటి సమస్యలు రావచ్చు. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి కనిపిస్తాయి.

ఏదైనా తిన్న తర్వాత పండ్ల రసాలు తాగితే అంతా మేలే జరుగుతుంది. అలాగే ఇతర ఆహార పదార్థాలు తిన్నాక పండ్ల రసాలు తినడం వల్ల పోషకాల శోషించుకోవడం మెరుగుపడుతుంది. పోషకాహార లోపం రాకుండా అడ్డుకోవచ్చు. కాబట్టి ఎవరూ కూడా ఉదయం లేచాక ఖాళీ పొట్టతో జ్యూసులు వంటివి తాగకూడదు. నిజం చెప్పాలంటే టీ, కాఫీలు ఖాళీ పొట్టతో తాగకూడదు. అయినా కూడా కోట్ల మంది వాటికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా మానాలన్నా కూడా మానలేరు. ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీరు తాగడం చాలా అవసరం. అలాగే ఆ గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగితే ఇంకా మంచిది.ఒక గ్లాసుడు నీళ్లు ఉదయం లేచిన వెంటనే తాగేస్తే ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి.

WhatsApp channel

టాపిక్