Chicken Recipe: దాబా స్టైల్‌లో చికెన్ కర్రీ ఇలా వండితే గ్రేవీ చిక్కగా టేస్టీగా వస్తుంది-cook chicken curry in dhaba style the gravy will be thick and tasty recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Recipe: దాబా స్టైల్‌లో చికెన్ కర్రీ ఇలా వండితే గ్రేవీ చిక్కగా టేస్టీగా వస్తుంది

Chicken Recipe: దాబా స్టైల్‌లో చికెన్ కర్రీ ఇలా వండితే గ్రేవీ చిక్కగా టేస్టీగా వస్తుంది

Haritha Chappa HT Telugu
May 02, 2024 06:00 PM IST

Chicken Recipe: దాబా స్టైల్ లో చికెన్ కర్రీ వండి చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. గ్రేవీ కూడా చిక్కగా, స్పైసీగా, టేస్టీగా వస్తుంది. దాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా వండాలో తెలుసుకోండి.

చికెన్ రెసిపీ
చికెన్ రెసిపీ (Youtube)

Chicken Recipe: చికెన్ కర్రీని స్పైసీగా, గ్రేవీ ఎక్కువ వచ్చేలా ఉండాలంటే ఇక్కడ ఇచ్చిన రెసిపీని ఫాలో అవ్వండి. దాబా స్టైల్ లో ఉండే చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీ లోకి కూడా బాగుంటుంది. దీన్ని స్పైసీగా కావాలనుకుంటే కారం అధికంగా వేసుకోవచ్చు. ఇది దాబా స్టైల్ స్పైసీ చికెన్ రెసిపీ ఒకసారి ప్రయత్నించండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

దాబా స్టైల్ చికెన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ ముక్కలు - అర కిలో

జీడిపప్పు - అయిదు

పాలు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - నాలుగు

నూనె - సరిపడినంత

టమాట - ఒకటి

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

పెరుగు - రెండు స్పూన్లు

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

దాబా స్టైల్ లో చికెన్ కర్రీ రెసిపీ

1. ఒక గిన్నె తీసుకొని చికెన్ శుభ్రంగా కడిగి అందులో వేయాలి.

2. చికెన్ లోనే పెరుగు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయాలి.

3. కనీసం రెండు గంటల పాటు మ్యారినేట్ చేయండి.

4. ఇప్పుడు మిక్సీలో నానబెట్టిన జీడిపప్పు, పాలు వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోండి.

5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

6. నూనె వేడెక్కాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను రంగు మారేవరకు వేయించండి.

7. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.

8. ఆ మిశ్రమంలో ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి.

9. తర్వాత సన్నగా తరిగిన టమోటాలను వేసి కలిపి పైన మూత పెట్టండి.

10. టమాటాలు మెత్తగా ఇగురులాగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించండి.

11. ఇప్పుడు స్టవ్ కట్టేయండి. వేయించిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోండి.

12. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టి నూనె వేయండి.

13. అందులో కరివేపాకులు వేసి వేయించండి.

14. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను కూడా వేసి వేయించి ఐదు నిమిషాల పాటు ఉడికించండి.

15. ఆ మిశ్రమంలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును అలాగే ఉల్లిపాయ టమాటా వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపండి.

16. ఐదు నిమిషాల పాటు ఉడికించండి. పైన మూత పెట్టి అరగంట పాటు వదిలేయండి.

17. ఇది చిన్న మంట మీద ఉంచితే బాగా ఉడుకుతుంది.

18. తర్వాత మూత తీస్తే టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ అయినట్టే.

19. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ కట్టేయండి.

20. ఇది రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.

21. ఒకసారి ప్రయత్నించారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే వండుకొని తింటారు.

22. దాబా స్టైల్ లో చేసే చికెన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా రావడానికి ఇలా వండటమే కారణం.

చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే. నూనెలో డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్కల కన్నా ఇలా ఉడికించిన చికెన్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్ లో విటమిన్ బి, విటమిన్ ఈ, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. కోడి మాంసం వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు తినడం అవసరం. దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. రక్త కణాలు ఉత్పత్తికి సహాయపడతాయి. రోజూ చికెన్ తినేవారు తక్కువ మోతాదులో తింటే మంచిది. చికెన్ కర్రీ వండుకున్న ప్రతిరోజు కారం, మసాలాలు దట్టించకూడదు. అప్పుడప్పుడు ఇలా స్పైసీ చికెన్ తిన్నా పర్వాలేదు. కానీ ప్రతిరోజూ స్పైసి, మసాలా కర్రీలు తింటే జీర్ణవ్యవస్థ అసౌకర్యానికి గురవుతుంది.

WhatsApp channel

టాపిక్