Suhas: నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్-suhas comments on prasanna vadanam movie press meet tollywood telugu cinema news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suhas: నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్

Suhas: నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 02, 2024 01:14 PM IST

Suhas About Prasanna Vadanam: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ హీరో సుహాస్. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో సుహాస్ చేసిన సినిమా ప్రసన్నవదనం. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను సుకుమార్ రిలీజ్ చేయగా.. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సుహాస్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్
నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్

Suhas About Prasanna Vadanam: యంగ్ టాలెంటెడ్ హీరోగా సుహాస్ నటించిన లేటెస్ట్ యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రసన్నవదనం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్‌లో హీరో సుహాస్ మాట్లాడుతూ.. "ప్రసన్నవదనం మే3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్ననే ఫస్ట్ కాపీ చూశాం. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి. కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి" అని చెప్పాడు.

"ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది. సీట్ ఎడ్జ్‌లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు" అని సుహాస్ చాలా నమ్మకంగా ప్రసన్న వదనం సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

"ఇది దర్శకుడిగా నా మొదటి చిత్రం. సినిమా చాలా బాగొచ్చింది. ఫస్ట్ కాపీ చూశాం. థియేటర్స్‌లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది యూనిక్ కాన్సెప్ట్‌తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సుహాస్ అద్భుతంగా చేశారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. అందరూ వచ్చి థియేటర్స్‌లో చూడాలి" అని డైరెక్టర్ అర్జున్ కోరారు.

"సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. సుహాస్ గారు చాలా నేచురల్ యాక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమా చూడండి. మీ అందరినీ అలరిస్తుంది" అని బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ సింగ్ తెలిపింది.

"ప్రసన్న వదనం యూనిక్ కాన్సెప్ట్‌తో అందరినీ అలరించే చిత్రం. సుహాస్ గారితో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం. ఇందులో పక్కంటి అమ్మాయిలా కనిపించే పాత్ర చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది" అని పాయల్ రాధాకృష్ణ పేర్కొన్నారు.

"టీజర్ ట్రైలర్ సాంగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. మే3న సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" నిర్మాత ప్రసాద్ రెడ్డి అన్నారు. "మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడండి. వందకి వంద శాతం అలరిస్తుంది. అందరూ థియేటర్స్‌కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం" అని మరో నిర్మాత జేఎస్ మణికంఠ తెలిపారు.

IPL_Entry_Point