AP Elections 2024 : ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు - పోలింగ్ కోసం 46,389 కేంద్రాలు ఏర్పాటు-ap chief electoral officer mukesh kumar meena said that there are 4 14 crore voters in the andhrapradesh ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections 2024 : ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు - పోలింగ్ కోసం 46,389 కేంద్రాలు ఏర్పాటు

AP Elections 2024 : ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు - పోలింగ్ కోసం 46,389 కేంద్రాలు ఏర్పాటు

Maheshwaram Mahendra Chary HT Telugu
May 02, 2024 05:24 PM IST

Andhrapradesh Elections 2024 Updates : ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానిధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన… పోలింగ్ కేంద్రాలతో పాటు ముఖ్య వివరాలను వెల్లడించారు.

ఏపీలో ఎన్నికలు 2024
ఏపీలో ఎన్నికలు 2024 (https://ceoandhra.nic.in/ceoap_new)

AndhraPradesh Voters 2024 : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు రంగం(AP Elections 2024) సిద్ధమైంది. అయితే రాష్ట్రంలోని మొత్తం ఓటర్లకు సంబంధించిన వివరాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా(Andhra Pradesh chief electoral officer) గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

46,389 పోలింగ్‌ కేంద్రాలు…

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల కోసం మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖేశ్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) వివరించారు. ఒక్కో కేంద్రంలో 1500 మంది ఓట్లు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని…. 224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపామన్నారు.

సీ విజిల్ యాప్(c vigil app) ద్వారా ఇప్పటివరకు 16,345 ఫిర్యాదులు  అందాయని ముఖేశ్ కుమార్ మీనా చెప్పారు. ఇందులో 10,403 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని చెప్పారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా…. 156 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. 

ఏపీ వ్యాప్తంగా  150 అంతరాష్ట్ర చెక్‍ పోస్టులు ఉన్నాయిని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ (AP Election Notification) నుంచి ఇప్పటివరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్ చేశామని… రూ.105 కోట్ల విలువైన నగలు, 47 కోట్ల నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు.  రూ.28 కోట్ల విలువైన మద్యం, రూ.3.6 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు వివరించారు.

 రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.  రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు.  14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‍కాస్టింగ్ చేయాలని పర్యవేక్షకుల నుంచి సిఫార్సులు అందాయన్నారు. ఇందులో  మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.

ఇవాళ్టి నుంచి హోం ఓటింగ్ - సీఈవో ముఖేశ్ కుమార్ మీనా

ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెడికల్ కిట్ లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

"రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోమ్ ఓటింగ్ కు సమ్మతి తెలిపారు. జనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదు. అలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వము. ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తు ను మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాం. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ మొదలు పెట్టాం. పెరిగిన అభ్యర్థుల కారణం గా అదనం గా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం రాష్ట్రంలో 374 మంది ఎమ్మెల్యే అభ్యర్దులు, 64 మంది ఎంపి అభ్యర్దులు భద్రత కావాలని అడిగారు వీటిని డీజీపీకి పంపాము" అని ఎన్నికల ప్రధానాధికారి మీడియాకు వెల్లడించారు.

AP Assembly Election Schedule : ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ 

  • ఎన్నికల నోటిఫికేషన్- ఏప్రిల్ 18
  • నామినేషన్లు స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25
  • నామినేషన్లు ఉపసంహరణ-ఏప్రిల్ 29
  • నామినేషన్ పరిశీలన -ఏప్రిల్ 26
  • ఎన్నికల పోలింగ్ తేదీ- మే 13, 2024.
  • కౌంటింగ్ తేదీ- జూన్ 4,2024.

WhatsApp channel