Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల సమగ్ర సమాచారం - HT Telugu
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  లోక్‌సభ ఎన్నికలు
election-header-title-arrow(left)

Elections 2024

election-header-title-arrow(right)
లోక్‌సభ ఎన్నికలు 2024 విగంహ వీక్షణం

18వ లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని, 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెబుతూ మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల కసరత్తు 75 రోజుల్లో ముగియగా, తాజాగా 2024లో ఎన్నికల ప్రక్రియ మొత్తం 81 రోజుల పాటు కొనసాగనుంది.

లోక్‌సభ పోలింగ్ జరిగే రోజే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆయా తేదీలను కూడా షెడ్యూలులో భాగంగా ప్రకటించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను ఈసీ ప్రకటించింది.

ఎంత మంది ఓటర్లు పాల్గొననున్నారు?

మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.8 కోట్లు, 20-29 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 19.74 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఐదవ వంతు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 10.48 లక్షల పోలింగ్ కేంద్రాలు, 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది, 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు ఈ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగం కానున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రధానంగా ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్య ఉంది.

ఎన్డీయే కూటమి బలం ఇదే

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో నేషనల్ పీపుల్స్ పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)(అజిత్ పవార్), జనతాదళ్(సెక్యులర్), ఏఐఏడీఎంకే (ఓపీఎస్), అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్, పుథియ నీది కచ్చి, జనతాదళ్ (యూ), లోక్‌జనశక్తి పార్టీ (రాంవిలాస్), రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ తదితర ప్రధాన పార్టీలు ఉన్నాయి. అలాగే హిందుస్తానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్‌జనతా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అసోం గణ పరిషద్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, అప్నాదళ్(సోనేలాల్), రాష్ట్రీయ లోక్‌దళ్, నిషాద్ పార్టీ, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, మిజోనేషనల్ ఫ్రంట్, జననాయక్ జనతా పార్టీ, హర్యానా లోక్‌హిత్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నాగా పీపుల్స్ ఫ్రంట్, శిరోమణి అకాలీదళ్ సంయుక్త, భారత్ ధర్మ జనసేన, కేరళ కామరాజ్ కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), రాష్ట్రీయ సమాజ్ పక్ష, ప్రహార్ జనశక్తి పార్టీ, జన సురాజ్య శక్తి, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తదితర పార్టీలు ఉన్నాయి.

ఇండియా కూటమి బలం ఇదే

ఇక కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉన్న ఇండియా కూటమి కొత్తగా ఏర్పడింది. దీని పూర్తి పేరు. ది ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా). దీనికి ఛైర్‌పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కేరళ కాంగ్రెస్ (ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ థాకరే), విదుతలై చిరుతైగల్ కచ్చి తదితర పార్టీలు ఉన్నాయి.
ఇంకా చదవండి
timer-clock-iconరిజల్ట్ తేదీ కౌంట్ డౌన్
17రోజులు :15గంటలు :46నిమిషాలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు - 2019

మొత్తం సీట్లు: 543మెజారిటీ: 272
  • బీజేపీ303
  • ఐఎన్‌సీ52
  • ఇతరులు188
టెక్స్ట్ మీద క్లిక్ చేయండి
  • ఆంధ్రప్రదేశ్25
  • తెలంగాణ17
  • తమిళనాడు39
  • కర్ణాటక28
  • మహారాష్ట్ర48
మే 20వ తేదీన లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్
Lok Sabha Elections Phase 5: ఐదో దశలో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..

Thursday, May 16, 2024

Factcheck: ఇది హైదరాబాద్‌లోని బహదూరపురలో MIM ఓట్లు రిగ్గింగ్ చేస్తున్న వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంత?
Fact Check: హైదరాబాద్‌‌‌లో రిగ్గింగ్ జరిగినట్టు చూపుతున్న వీడియో నిజమేనా?

Thursday, May 16, 2024

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ
Mamata Banerjee: ‘కేంద్రంలో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తాం’: మమతా బెనర్జీ

Wednesday, May 15, 2024

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై పలు సంస్థలు సర్వే చేశాయని చెబుతున్న సోషల్ మీడియా పోస్ట్
Factcheck: ఇండియా టుడే, టైమ్స్ నౌ సహా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు

Wednesday, May 15, 2024

మేనల్లుడు శ్రీనిక్‌‌తో బైక్‌పై బండి సంజయ్
Bandi sanjay: పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల రిలాక్స్.. కుటుంబ సభ్యులతో కాలక్షేపం

Wednesday, May 15, 2024

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు
Medak Election Money: ఎన్నికల వేళ డబ్బు తరలింపుపై పోలీసులకు ఉప్పందించిన ఉద్యోగి.. విషయం బయటపడటంతో ఆత్మహత్య

Wednesday, May 15, 2024

కేటీఆర్
KTR : కూటములకు కాలం చెల్లింది, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా- కేటీఆర్

Tuesday, May 14, 2024

ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వంతు, బరిలో 52 మంది
Graduate Mlc Election : ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వంతు, బరిలో 52 మంది

Tuesday, May 14, 2024

ఎన్నికల విధుల్లోని టీచర్ల ఆందోళన
Narayankhed News : ఎన్నికల విధుల్లోని టీచర్ల ఆందోళన, పోలీసుల లాఠీఛార్జ్!

Tuesday, May 14, 2024

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెరిగిన పోలింగ్
Orugallu Polling: ఓరుగల్లులో గతానికంటే మెరుగైన పోలింగ్, వరంగల్ లో 68.29శాతం, మహబూబాబాద్ లో 70.68 శాతం నమోదు

Tuesday, May 14, 2024

ఎన్నికల నామినేషన్​ని దాఖలు చేసిన మోదీ..
PM Modi nomination : అంగరంగ వైభవంగా.. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్​

Tuesday, May 14, 2024

కరీంనగర్‌ ఫలితాలపై ఎవరి దీమా వారిదే
Karimnagar Polling: పోలింగ్ ముగిసింది, గెలుపుపై ఎవరి ధీమా వారిదే, మరో మూడు వారాలు టెన్షన్..

Tuesday, May 14, 2024

మెదక్‌, జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో భారీగా పెరిగిన పోలింగ్
Medak, Zahirabad: మెదక్, జహీరాబాద్ లో పెరిగిన ఓటింగ్‌తో లాభ పడేది ఎవరు? 2019కంటే పెరిగిన పోలింగ్…

Tuesday, May 14, 2024

గ్రేటర్ హైదరాబాాద్‌లో భారీగా తగ్గిన ఓటింగ్
‌Hyderabad Polling: గ్రేటర్‌లో తగ్గిన పోలింగ్ శాతం, ఎవరికి ప్లస్? ఎవరికి మైనస్? ఏపీ ఓటర్ల ప్రభావం ఎంత?

Tuesday, May 14, 2024

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
HT interview with PM Modi : ‘మేము చేసిన అభివృద్ధిని చూసే.. ప్రజలు మాకు ఓట్లేస్తారు’- మోదీ

Tuesday, May 14, 2024

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi: ‘‘మోదీ రిటైర్ కారు.. ఆయనను రాజకీయంగా ఓడించాల్సిందే. తొలి ముస్లిం ప్రధానిగా ఒక మహిళ’’- అసదుద్దీన్ ఓవైసీ

Tuesday, May 14, 2024

పరకాలలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఉద్రిక్తత
Parakala Fight: పరకాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్,ఓట్ల లెక్కలు వేసుకుంటూ కొట్టుకున్న ఇరువర్గాల నాయకులు

Tuesday, May 14, 2024

ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు
Siddipet News : సిద్దిపేటలో విషాదం, ఓటు వేసి ప్రాణం విడిచిన వృద్ధురాలు

Monday, May 13, 2024

ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక
Mulugu News : ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల కాలినడక, ఆదర్శం పెనుగోలు గిరిజనులు

Monday, May 13, 2024

చిన్నకోల్వాయి ఓటర్లకు హ్యాట్సాఫ్
Jagtial News : చిన్నకోల్వాయి ఓటర్లకు హ్యాట్సాఫ్, వందశాతం పోలింగ్ నమోదు

Monday, May 13, 2024

Photo Gallery

తరచూ అడిగే ప్రశ్నలు, జవాబులు ( FAQ)

తెలంగాణలో ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నాయి?

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి

ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉన్నాయి?

ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

తెలంగాణలో 2019లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది

తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందాయి.

ఏపీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది?

ఏపీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 స్థానాల్లో, తెలుగు దేశం 3 స్థానాల్లో గెలుపొందాయి.