tourism News, tourism News in telugu, tourism న్యూస్ ఇన్ తెలుగు, tourism తెలుగు న్యూస్ – HT Telugu

Latest tourism Photos

జీవ వైవిధ్యభరితమైన అభయారణ్యం, కాలుష్య రహిత సరస్సు.. ఈ రెండు పాకాల సొంతం. కాకతీయుల కళావారసత్వ సంపదగా పాకాలకు పేరుంది. అందుకే పాకాల అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు ఆసక్తి చూపిస్తారు.

Telangana Tourism : నేచర్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. పాకాలలో బోటు షికారుకు రైట్ రైట్!

Friday, December 6, 2024

వేర్వేురు టూరిజం ప్రదేశాలను చూసేందుకు IRCTC టూరిజం కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది . తక్కువ ధరలోనే వీటిని ఆపరేట్ చేస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది.

Araku Simhachalam Tour : ఒకే ట్రిప్ లో అరకు, సింహాచలం దర్శనం - ఈ టూరిస్ట్ ప్లేసులన్నీ చూడొచ్చు, తాజా ప్యాకేజీ వివరాలు

Sunday, December 1, 2024

టూర్ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ డే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. సెకండ్ డే ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

IRCTC Shirdi Tour : ఒకే ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ దర్శనం - విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, డిసెంబర్ నెలలో ట్రిప్

Saturday, November 30, 2024

అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. అరుణాచలం అర్థం ఎర్రని కొండ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. కేవలం స్మరణ చేస్తేనే ముక్తి లభిస్తుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు.

Arunachalam Giri Pradakshina : అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎప్పుడు, ఎలా చేయాలి? 6 ముఖ్యమైన అంశాలు

Saturday, November 30, 2024

అరకు.. ఈ పేరు వినగానే ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక్కడ కాఫీ తోటలు చాలా స్పెషల్. ఈ కాఫీ తోటలను చూసేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో.. టూరిస్టులు సరికొత్త అనుభూతి పొందేలా ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

AP Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్

Friday, November 29, 2024

ఏపీ ప్రభుత్వం ఇటీవల విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. తాజాగా మరోచోట సీ ప్లేన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నం నుంచి సీలేరు వరకు సీప్లేన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదన మరోమారు తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

AP Tourism : అల అలలపై ప్రయాణం.. విశాఖపట్నం టు సీలేరు.. త్వరలో సీప్లేన్ సేవలు!

Thursday, November 28, 2024

హమ్ సఫర్  ఎక్స్ ప్రెస్

హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ భారతదేశంలోని ఆరవ పొడవైన రైల్వే లైన్. త్రిపురలోని అగర్తలా నుండి కర్ణాటకలోని బెంగళూరు కంటోన్మెంట్ వరకు ఈ రైలు నడుస్తుంది. ప్రకృతి అందాల మార్గాలలో ప్రయాణాన్ని ఇష్టపడేవారికి ఎక్స్ ప్రెస్ ఒక గొప్ప ఎంపిక. రైలు 3,599 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దాని నిర్దేశిత ప్రదేశాలను చేరుకోవడానికి 65 గంటలు పడుతుంది. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది.

Longest travelling trains: మన దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే టాప్ 10 రైళ్లు ఇవే.. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు..

Wednesday, November 27, 2024

హైదరాబాద్ - వయనాడ్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHR098

IRCTC Wayanad Tour : 'వండర్స్ ఆఫ్ వయనాడ్' ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, వివరాలివే

Wednesday, November 27, 2024

రాజమహేంద్రవరం నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో.. సామర్లకోట రైల్వే స్టేషన్‌కు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కుమారారామం ఉంది. ఇది పంచరామాల్లో చివరిది, అయిదవది. ఇక్కడ శివలింగం 60 అడుగుల ఎత్తులో.. రెండంతస్తుల మండపంగా ఉంటుంది. తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు. ఆయన ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది. ఆ తరువాత బౌద్ధుల ప్రాబల్యం కారణంగా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఇక్కడి స్వామిని కుమార భీమేశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు.

AP Tourism : 60 అడుగుల ఎత్తులో శివ లింగం.. 'కుమారారామం' దర్శనం సర్వపాపహరణం!

Monday, November 25, 2024

తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి.

AP Tourism : చరిత్ర చెప్పని ఎన్నో రహస్యాలు ఈ క్షేత్రం సొంతం.. ద్రాక్షారామం దర్శనం పూర్వజన్మ సుకృతం

Sunday, November 24, 2024

‘ULTIMATE OOTY EX HYDERABAD ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

IRCTC Ooty Tour : మంచు కురిసే వేళలో 'ఊటీ' అందాలు చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు

Sunday, November 24, 2024

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. చరిత్రకు అద్దంపట్టే ప్రదేశాలకు లెక్కలేదు. ఆహ్లాదం, ఆనందాన్ని పంచే ప్రాంతాలకు కొదవ లేదు. కానీ.. ఆ ప్రాంతాలపై దృష్టిపెట్టక అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకులు వచ్చినా.. సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రధానంగా 10 సర్క్యూట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

Telangana Tourism : ఇకనుంచి తెలంగాణలో టూరిజం వేరే లెవల్.. సరికొత్త అనుభూతిని పొందడానికి సిద్ధమవ్వండి

Sunday, November 24, 2024

ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలలో తృతీయ క్షేత్రం క్షీరారామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ జనార్ధనులు, బ్రహ్మ సరస్వతులు, విఘ్నేశ్వర, సుబ్రమణ్యేశ్వర, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రాది సకల దేవతలతో, మహర్షులతో శ్రీ క్షీరారామేశ్వరుడు కొలువుతీరాడు. ఈ క్షేత్రాన్ని పరమ పుణ్యధామంగా మన పురాణాలు చెబుతాయి.

AP Tourism : జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన శివాలయం ఇది.. శ్రీ క్షీరారామలింగేశ్వర క్షేత్రం విశేషాలు

Saturday, November 23, 2024

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే Nizam Palaces Tour పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది.

Telangana Tourism : చౌమహల్లా, ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ చూసొద్దామా..! వన్ డే టూర్ ప్యాకేజీ వచ్చేసింది, వివరాలివే

Saturday, November 23, 2024

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో మూడో ద్వీపాన్ని  (ఐలాండ్) టూరిజం మంత్రి జూపల్లి ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Tourism : లక్నవరంలో మూడో 'ఐల్యాండ్' - విశేషాలివే

Thursday, November 21, 2024

హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. హైదరాబాద్ లో ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.  రాత్రికి సాగర్ లోనే బస చేస్తారు.

Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సాగర్ నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వివరాలివే

Wednesday, November 20, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంపై ఫోకస్ పెట్టింది. వైజాగ్‌లో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. విశాఖ అందాలను ఆకాశం నుంచి చూసే అద్బుత అవకాశం కల్పిస్తోంది.

AP Tourism : గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే.. ఆకాశం నుంచి విశాఖ అందాలు చూసే అద్భుత అవకాశం

Saturday, November 16, 2024

ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.  ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 20, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

Araku Tour Package : మంచు కురిసే వేళలో 'అరకు' అందాలను చూసొద్దామా..! అతి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

Thursday, November 14, 2024

హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4499 గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3599గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. వీకెండ్స్ లో జర్నీ ఉంటుంది.

Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సోమశిల నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

Wednesday, November 13, 2024

కడప జిల్లా చిట్వేలి మండలంలో ప్రసిద్ధ శైవక్షేత్రం ఉంది. ఇది గుండాలకోనలో ఉంది. ఇక్కడ గుండాలఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

AP Tourism : దట్టమైన అడవిలో ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆధ్యాత్మికం.. ఈ కార్తీకమాసంలో ఇక్కడికి టూర్ ప్లాన్ చేసుకోండి!

Sunday, November 10, 2024