Women's Asia Cup 2022: చెలరేగిన ఇండియన్ బౌలర్లు.. 37 రన్స్‌కే కుప్పకూలిన థాయ్‌లాండ్
Women's Asia Cup 2022: ఆసియా కప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియన్ బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో ఆ టీమ్ కేవలం 37 రన్స్‌కే కుప్పకూలింది.
Women's Asia Cup 2022: ఆసియాకప్‌లో 5 మ్యాచ్‌లలో 4 విజయాలతో టాప్‌లో ఉన్న టీమిండియా.. ఆరో మ్యాచ్‌లో ప్రతాపం చూపించింది. పసికూన థాయ్‌లాండ్ టీమ్‌ను ఓ ఆటాడుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్ సేన.. 15.1 ఓవర్లలో 37 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా 3, రాజేశ్వరి గైక్వాడ్ 2, దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
థాయ్ టీమ్‌లో ఓపెనర్ నన్నపట్ కొంచారెంకాయ్ 12 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక మిగిలిన పది మంది సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇండియన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కేవలం ఒకే ఒక్క ఎక్స్‌ట్రా రన్ ఇచ్చారు. ముఖ్యంగా స్నేహ్ రాణా 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం విశేషం.
రాజేశ్వరి 3 ఓవర్లలో 8 పరుగులకు 2 వికెట్లు, దీప్తి శర్మ 4 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నారు. భారత బౌలర్ల ధాటికి థాయ్‌లాండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 13 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. 20 పరుగుల దగ్గర రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 24 రన్స్ దగ్గర మరో రెండు వికెట్లు పడ్డాయి. ముగ్గురు థాయ్ బ్యాటర్లు డకౌటయ్యారు.