Virat Kohli Records: విరాట్‌ సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌.. ఎన్ని రికార్డులు బ్రేకయ్యాయో చూడండి-virat kohli shattered many records with one sensational innings against pakistan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Records: విరాట్‌ సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌.. ఎన్ని రికార్డులు బ్రేకయ్యాయో చూడండి

Virat Kohli Records: విరాట్‌ సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌.. ఎన్ని రికార్డులు బ్రేకయ్యాయో చూడండి

Hari Prasad S HT Telugu
Oct 23, 2022 06:59 PM IST

Virat Kohli Records: విరాట్‌ కోహ్లి సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులను బ్రేక్‌ చేశాడు. పాకిస్థాన్‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్‌ తన టీ20 కెరీర్‌లో బెస్ట్‌ అని చెప్పిన కోహ్లి.. ఏ రికార్డులు బద్ధలు కొట్టాడో చూడండి.

సంచలన ఇన్నింగ్స్ తో రికార్డులు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి
సంచలన ఇన్నింగ్స్ తో రికార్డులు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి (ANI)

Virat Kohli Records: కింగ్‌ కోహ్లి తనలోని చేజ్‌ మాస్టర్‌ను మరోసారి నిద్రలేపాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌లాంటి టీమ్‌పై సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఆశలన్నీ వదిలేసుకొని నిరాశగా టీవీలు ఆఫ్‌ చేసిన ఇండియన్‌ ఫ్యాన్స్‌ చివరికి ఒక రోజు ముందే దీపావళి జరుపుకునేలా చేశాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో అతడు ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ అని మ్యాచ్ తర్వాత విరాట్‌ అన్నాడు. అతడు 53 బాల్స్‌లోనే 82 రన్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇన్నింగ్స్‌తో అతడు కొన్ని రికార్డులు బ్రేక్‌ చేశాడు.

కోహ్లి బ్రేక్‌ చేసిన రికార్డులు

- విరాట్‌ కోహ్లి ఇప్పుడు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు

- టీ20ల్లో విరాట్‌ కోహ్లికి ఇది 14వ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. దీంతో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఘనతను విరాట్ సొంతం చేసుకున్నాడు.

- ఇక టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్‌కు ఇది ఆరో మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఇది కూడా గతంలో ఏ ప్లేయర్‌కూ సాధ్యం కాని రికార్డే.

- టీ20 వరల్డ్‌కప్‌లలో విరాట్ కోహ్లి ఇప్పటి వరకూ 927 రన్స్‌ చేశాడు. ఈ మెగా టోర్నీల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా విరాట్‌ నిలిచాడు. ఇప్పటి వరకూ 851 రన్స్‌తో రోహిత్ శర్మ పేరిట ఈ రికార్డు ఉంది.

- పాకిస్థాన్‌పై టీ20ల్లో విరాట్‌ కోహ్లికి ఇది ఐదో హాఫ్‌ సెంచరీ. అందులో నాలుగు వరల్డ్‌కప్‌లలోనే వచ్చాయి. టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక హాఫ్‌ సెంచరీల రికార్డును కోహ్లి సమం చేశాడు. వెస్టిండీస్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌ కూడా ఆస్ట్రేలియాపై వరల్డ్‌కప్‌లలో నాలుగు హాఫ్‌ సెంచరీలు చేశాడు.

WhatsApp channel