Rishabh Pant Birthday: పంత్ పుట్టినరోజున ఊర్వశి బర్త్‌డే పోస్ట్ వైరల్.. ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ విషెస్.. ఎవరికి చెప్పింది?-urvashi rautela birthday post amid rishabh pant birth day ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Urvashi Rautela Birthday Post Amid Rishabh Pant Birth Day

Rishabh Pant Birthday: పంత్ పుట్టినరోజున ఊర్వశి బర్త్‌డే పోస్ట్ వైరల్.. ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ విషెస్.. ఎవరికి చెప్పింది?

పంత్-ఊర్వశి
పంత్-ఊర్వశి (HT)

Urvashi Rautela Birthday Wishes to Rishabh Pant: టీమిండియా కీపర్ రిషభ్ పంత్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టా షెర్ చేసిన బర్త్ డే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు పంత్‌కు ఆ పోస్టును ట్యాగ్ చేశారు.

Rishabh Pant Birthday: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇంతవరకు పంత్‌కు ఇప్పటి వరకు బ్యాటింగ్ ఆడే ఛాన్స్ రాలేదు. ఆ అవకాశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే పంత్ ఈ రోజు 25వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు అతడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే ఎంతమంది అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినప్పటికీ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా పెట్టిన పోస్టు మాత్రం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హ్యాపీ బర్త్‌డే అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఇందులో వింతేముంది అని మీరనుకోవచ్చు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వివాదం చెలరేగుతుంది. పంత్ ప్రపోజల్‌ను ఊర్వశి రిజెక్ట్ చేసిందని, ఆనంతరం పేర్లు పెట్టి ప్రత్యక్షంగా విమర్శించుకోనప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ఘాటుగా విమర్శించుకున్నారు. కొన్నిరోజుల పాటు వీరి మధ్య హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. కాబట్టి తాజాగా పంత్ పుట్టినరోజు నాడు ఊర్వశి పెట్టి పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఈ బాలీవుడ్ భామ.. పంత్ పేరును ప్రస్తావించకుండా.. కేవలం హ్యాపీ బర్త్‌డే అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఊర్వశి బర్త్‌డే విషెస్ చెప్పిందని పంత్‌కే అనుకుని అతడికి ట్యాగ్ చేస్తున్నారు.

రిషభ్ పంత్-ఊర్వశి రౌతేలా మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్ధం జరిగింది. మిస్టర్‌ ఆర్పీ తనను కలవడానికి వచ్చి గంటల తరబడి వేచి చూశాడని, ఎన్నో కాల్స్‌ చేశాడని ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో పంత్‌ గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా తెలిపింది. అనంతరం ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. నన్ను వదిలెయ్‌ అక్కా.. ఇంకెన్ని అబద్ధాలు ఆడతావ్‌.. అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ లిమిట్‌ ఉంటుందంటూ కౌంటర్ ఇచ్చాడు.

కానీ ఈ విషయాన్ని ఊర్వశి మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ఈసారి ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో చాలా ఘాటుగా పంత్‌కు రిప్లై ఇచ్చింది."తమ్ముడు బ్యాట్‌ బాల్ ఆడుకోవాలి. యంగ్‌ కిడో డార్లింగ్‌ నీతో బద్నామ్‌ కావడానికి నేనేమీ మున్నీని కాదు. రక్షాబంధన్‌ శుభాకాంక్షలు ఆర్పీ తమ్ముడూ. అమ్మాయి మౌనాన్ని అలుసుగా తీసుకోకు" అని చాలా స్ట్రాంగ్‌గా రియాక్టయింది. దీంతో నెటిజన్లు కూడా తమకు నచ్చినవారిని వెనకేసుకొచ్చారు. వీరి మాటల యుద్ధం కాస్త తగ్గిందనుకునేలోపే తాజాగా మరోసారి బహిర్గతమైంది.

WhatsApp channel

సంబంధిత కథనం