Pant vs Urvashi: తమ్ముడూ క్రికెట్‌ ఆడుకో.. నాతో పెట్టుకోకు: పంత్‌కు ఊర్వశి కౌంటర్-urvashi rautela strongly reacted to rishabh pants instagram story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Urvashi Rautela Strongly Reacted To Rishabh Pants Instagram Story

Pant vs Urvashi: తమ్ముడూ క్రికెట్‌ ఆడుకో.. నాతో పెట్టుకోకు: పంత్‌కు ఊర్వశి కౌంటర్

Hari Prasad S HT Telugu
Aug 12, 2022 10:34 AM IST

Pant vs Urvashi: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా మధ్య మాటల యుద్దం ముదురుతోంది. గురువారం (ఆగస్ట్‌ 11) పంత్‌ సీరియస్‌గా ఇచ్చిన రిప్లైకి.. ఊర్వశి అంతకంటే సీరియస్‌గా కౌంటర్‌ ఇచ్చింది.

ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్
ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్

న్యూఢిల్లీ: నన్ను వదిలెయ్‌ అక్కా.. ఇంకెన్ని అబద్ధాలు ఆడతావ్‌ అంటూ రిషబ్‌ పంత్‌ గురువారం తన ఇన్‌స్టా స్టోరీ రాసి తర్వాత దానిని డిలీట్‌ చేసిన విషయం తెలుసు కదా. అది ఈ మధ్యే బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు పంత్ ఇచ్చిన కౌంటర్‌ అని ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు. మిస్టర్‌ ఆర్పీ తనను కలవడానికి వచ్చి గంటల తరబడి వేచి చూశాడని, ఎన్నో కాల్స్‌ చేశాడని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

నేరుగా రిషబ్‌ పంత్‌ పేరు ఆమె చెప్పకపోయినా.. అతడు మాత్రం ఇన్‌స్టా స్టోరీలో స్పందించాడు. అదంతా అబద్ధం.. ఇంకెన్ని అబద్ధాలు ఆడతావ్‌.. నన్ను వదిలెయ్‌ అక్కా.. అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ లిమిట్‌ ఉంటుందంటూ పంత్‌ ఆ స్టోరీలో రాసి తర్వాత డిలీట్‌ చేశాడు. కానీ ఈ విషయాన్ని ఊర్వశి మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ఈసారి ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో చాలా ఘాటుగా పంత్‌కు రిప్లై ఇచ్చింది.

"తమ్ముడు బ్యాట్‌ బాల్ ఆడుకోవాలి. యంగ్‌ కిడో డార్లింగ్‌ నీతో బద్నామ్‌ కావడానికి నేనేమీ మున్నీని కాదు. రక్షాబంధన్‌ శుభాకాంక్షలు ఆర్పీ తమ్ముడూ. అమ్మాయి మౌనాన్ని అలుసుగా తీసుకోకు" అని చాలా స్ట్రాంగ్‌గా రియాక్టయింది. దీనిపై ట్విటర్‌లో నెటిజన్లు మండిపడుతున్నారు. అనవసరంగా పంత్‌తో పెట్టుకోకు అని ఒకరు ఆమెకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు.

మరొకరు ఈ మధ్యే ఆమె ది లెజెండ్‌ మూవీలో నటించడాన్ని గుర్తు చేస్తూ.. ఊర్వశి ఓవైపు ఓ జోకర్‌తో లెజెండ్‌ అనే మూవీలో నటిస్తే.. పంత్‌ మాత్రం ఇప్పటికే క్రికెట్‌లో అసలైన లెజెండ్స్‌తో పోటీపడుతున్నాడంటూ కౌంటర్‌ వేశారు. తనను రిజెక్ట్‌ చేసిన ఊర్వశిని అక్కా అని పిలిచిన పంత్ కాన్ఫిడెన్స్‌ నచ్చిందని మరో వ్యక్తి కామెంట్‌ చేశారు. ఊర్వశి వయసు 28 ఏళ్లు కాగా.. పంత్‌ వయసు 24 ఏళ్లు. దీంతో అతడు ఆమెను అక్కా అని పిలవగా.. ఆమె అతన్ని తమ్ముడూ అని పిలిచి కౌంటర్‌ వేసింది.

It all started when the bollywood actress narrated a story of "Mr RP" waiting to meet her at an event in New Delhi in an interview with Bollywood Hungama. The meeting never took place as Rautela said she was tired and had gone to sleep without realising that there were "16-17 missed calls."

“I was shooting in Varanasi, and I had a show in New Delhi thereon, so I had to take a flight. In New Delhi, I was shooting a full day, and after about 10 hours of shooting, when I went back, I had to get ready, and you know that girls take a lot of time to get ready. Mr. RP came, he sat in the lobby, and waited for me, and he wanted to meet. I was so tired that I dozed off to sleep, and I didn’t realize that I had received so many calls,” Urvashi said in an interview with Bollywood Hungama.

"So, when I woke up, I saw 16-17 missed calls and then I felt so bad. That, someone, was waiting for me and I didn’t go. Out of respect, because a lot of girls don’t care about making someone wait, out of that show of respect, I told him that let’s meet when you’ll come to Mumbai," she added.

The story did not end there, Pant, put up an Instagram story after that interview viral and went on to delete it within minutes. But it was up there for enough time for the screenshots to go viral.

"It's funny how people lie in interviews just for some meagre popularity and for hitting the headlines. Sad how some people are so thirsty for fame and name. May God bless them "merapichachorhoBehen #Jhutkibhilimithotihai.” Pant wrote.

IPL_Entry_Point