IND vs SA 2nd Odi Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
IND vs SA 2nd Odi Toss: రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌తో షాబాజ్ అహ్మద్ టీమ్ ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
IND vs SA 2nd Odi Toss: రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకున్నది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో సౌతాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. నేటి మ్యాచ్‌లో విజయాన్ని సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. రెండో వన్డేలో గెలిచి సిరీస్ ఆశలను నిలుపుకోవాలని టీమ్ ఇండియా బరిలో దిగుతోంది.
ఈ వన్డేలో టీమ్ ఇండియా రెండు మార్పులు చేసింది.వాషింగ్‌టన్ సుందర్‌తో పాటు షాబాజ్ అహ్మద్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు రవి బిష్ణోయ్‌లను పక్కనపెట్టారు. ఈ మ్యాచ్‌తోనే షాబాజ్ అహ్మద్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
సౌతాఫ్రికా కూడా రెండు మార్పులతో బరిలో దిగింది. అనారోగ్య సమస్యలతో కెప్టెన్ బవుమా, షంషీ తప్పుకున్నారు. వారి స్థానంలో ఫోర్టూయిన్, హెండ్రిక్స్‌కు అవకాశం దక్కింది.