WI vs IND: శ్రేయాస్ సూపర్ ఫీల్డింగ్.. సిక్సర్ ఏమి ఆపాడబ్బా.. !-shreays iyer save a sure shot sixer from nicholas pooran ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shreays Iyer Save A Sure Shot Sixer From Nicholas Pooran

WI vs IND: శ్రేయాస్ సూపర్ ఫీల్డింగ్.. సిక్సర్ ఏమి ఆపాడబ్బా.. !

Maragani Govardhan HT Telugu
Jul 30, 2022 05:45 PM IST

విండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. కచ్చితంగా వెళ్తుందనే సిక్సర్‌ను అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.

శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ (Twitter)

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ అద్భుత అర్ధశతకంతో భారత్.. 68 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. హిట్ మ్యాన్‌కు తోడు దినేశ్ కార్తీక్ కూడా బ్యాట్ ఝుళిపించిన వేళ టీమిండియా.. విండీస్‌ను 122 పరుగులకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నికోలస్ పూరన్ కొట్టిన షాట్‌ను సిక్స్ పోకుండా శ్రేయాస్ అయ్యర్ ఆపిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

విండీస్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ వేసిన ఐదో ఓవర్‌లో నికోలస్ పూరన్ భారీ షాట్‌కు యత్నించాడు. ఆ షాట్ చూస్తే బంతి తప్పకుండా సిక్సర్ పోతుందనే అనిపిస్తుంది. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న శ్రేయాస్ అయ్యర్ అదిరిపోయే ఫీల్డింగ్‌తో సిక్స్ పోకుండా అడ్డుకున్నాడు. క్యాచ్ అందుకుని బౌండరీ రోప్‌ను తాకకుండా కళ్లు చెదిరే రీతిలో బంతిని పక్కకు విసురుతాడు. రోప్ లైన్ దాటినప్పటికీ.. అప్పటికే బంతిని పక్కకు పెడతాడు. ఫలితంగా ఆ బంతికి రెండు పరుగులే వస్తాయి. సిక్సర్ పోవాల్సిన తరుణంలో నాలుగు పరుగులను సేవ్ చేస్తాడు శ్రేయాస్.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడంటూ నెటిజన్లు కూడా శ్రేయాస్ అయ్యర్‌ను ప్రశంసిస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 44 బంతుల్లో 64 పరుగులతో అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకోగా. దినేశ్ కార్తీక్ 19 బంతుల్లో 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా భారత్ 190 పరుగుల భారీ స్కోరును చేస్తుంది. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 122 పరుగులకే పరిమితమవుతుంది. చాలా కాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన హిట్ మ్యాన్.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టంచాడు. ఇప్పటి వరకు మార్టిన్ గప్తిల్ ఖాతాలో ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్