Shikhar Dhawan Favorite Songs: బాలీవుడ్ సాంగ్స్ వింటు చిల్ అవుతున్న గబ్బర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్-shikhar dhawan enjoys his all times favorite songs and video viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shikhar Dhawan Favorite Songs: బాలీవుడ్ సాంగ్స్ వింటు చిల్ అవుతున్న గబ్బర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Shikhar Dhawan Favorite Songs: బాలీవుడ్ సాంగ్స్ వింటు చిల్ అవుతున్న గబ్బర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Maragani Govardhan HT Telugu
Sep 22, 2022 12:58 PM IST

Shikhar Dhawan Enjoys with his Favorite Songs: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. తనకిష్టమైన బాలీవుడ్ సాంగ్స్ వింటూ ఫుల్ చిల్ అవుతున్నాడు. 90వ దశకంలోని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శిఖర్ ధావన్ డ్యాన్స్ వీడియో
శిఖర్ ధావన్ డ్యాన్స్ వీడియో (Instagram)

Shikhar Dhawan Favorite Songs: భారత స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆటగాళ్లలో ముందుంటాడు. తనకు సంబంధించిన ఏ చిన్న విషయమైన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటాడు. ప్రస్తుతం వన్డే టీమ్‌లో కీలక ఆటగాడిగా ఉన్న ధావన్.. టెస్టు, టీ20 జట్లకు మాత్రం దూరంగా ఉంచుతున్నారు సెలక్టర్. తాజాగా మన గబ్బర్ ఫుల్ చిల్ అవుతున్నాడు. బాలీవుడ్ 90వ దశకంలోని సూపర్ హిట్ పాటల వింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను ధావన్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను గమనిస్తే 1998వ సంవత్సరంలోని ఫేమస్ బాలీవుడ్ సాంగ్స్ వరుసగా ప్లే అవుతున్నాయి. వాటికి తగినట్లుగా శిఖర్ ధావన్ స్టెప్పులేస్తూ కనిపించాడు. ముందుగా ముఝ్‌కో క్యా హువా హై, చయ్యా చయ్యా, ఆంఖోన్ సే గోలీ మారే, ఆతిక్యా ఖండాలా, ఓ ఓ జానే జానా అంటూ వరుసగా పాటలు ప్లే అవుతుంటే.. వాటికి తగినట్లుగా గబ్బర్‌ స్టెప్పులతో అలరించాడు. బాలీవుడ్ ఫేవరెట్స్ పేరుతో ఈ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధావన్.. 2023 ప్రపంచకప్ కోసం తను మంచి ఫిట్‌గా ఉండటానికి తన ఫిట్నెస్ కాపాడుకోడానికి ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటానని చెప్పాడు. "నా కృషి, పట్టుదలతో ఇంత వరకు వచ్చినందుకు నాకు నేను కృతజ్ఞుడినై ఉన్నాను. 2023 ప్రపంచకప్ కోసం చూస్తున్నాను. ఆట పట్ల నాకున్న ప్రేమ, అంకితభావం వల్ల నన్ను నేను ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటాను. ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండి పని చేస్తూనే ఉంటాను. అది స్కిల్ వర్క్ అయినా లేదా ఫిట్నెస్ అయినా కష్టపడుతూనే ఉంటాను." అని శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు.

వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదు. గబ్బర్ చివరగా 2021 జులైలో శ్రీలంకతో జరిగిన టీ20లో ఆడాడు. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం వన్డే జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం