Telugu News  /  Sports  /  Rohit Sharma Better Than Virat Kohli Pakistan Pacer Sohail Khan Makes Statement
రోహిత్ శ‌ర్మ‌
రోహిత్ శ‌ర్మ‌

Rohit Better Than Kohli: కోహ్లి కంటే రోహిత్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ - పాక్ పేస‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

06 February 2023, 8:44 ISTNelki Naresh Kumar
06 February 2023, 8:44 IST

Rohit Better Than Kohli: టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌లో ఎవ‌రు గొప్ప ప్లేయ‌ర్ అనే కంపేరిజ‌న్స్ చాలా సార్లు వ‌చ్చాయి. వీరిద్ద‌రిపై పాకిస్థాన్ మాజీ పేస‌ర్ సోహైల్‌ఖాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. కోహ్లి కంటే రోహిత్ మంచి బ్యాట్స్‌మెన్ అని పేర్కొన్నాడు.

Rohit Better Than Kohli: గ‌త కొన్నేళ్లుగా టీమ్ ఇండియాలో కీల‌క ఆట‌గాళ్లుగా కొన‌సాగుతోన్నారు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ. గ‌తంలో విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో రోహిత్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొగిలిన త‌ర్వాత ఆ బాధ్య‌త‌ల్ని రోహిత్ చేప‌ట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గొప్ప క్రికెట‌ర్ అనే కంపేరిజ‌న్స్ చాలా సార్లు వ‌చ్చాయి. ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు వీరి ఆట‌తీరుపై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తంచేశారు. విరాట్‌, రోహిత్‌ల‌పై పాకిస్థాన్ మాజీ పేస‌ర్ సోహైల్‌ఖాన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లి కంటే రోహిత్ శ‌ర్మ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని సోహ‌ల్ ఖాన్ అన్నాడు.

గ‌త ద‌శాబ్ద కాలంగా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ త‌న‌దైన ముద్ర‌ను చాటుకుంటున్నాడ‌ని పేర్కొన్నాడు. గొప్ప బ్యాట్స్‌మెన్‌గా వెలుగొందుతున్నాని సోహైల్ ఖాన్ పేర్కొన్నాడు. కోహ్లి కూడా మంచి ఆట‌గాడేన‌ని, అత‌డి ఆట‌తీరును తాను గౌర‌విస్తాన‌ని అన్నాడు. కానీ ఓ బౌల‌ర్‌గా మాత్రం తాను కోహ్లి కంటే రోహిత్ మంచి బ్యాట్స్‌మెన్‌గా తాను భావిస్తున్న‌ట్లు చెప్పాడు.

రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ టెక్నిక్ వైవిధ్యంగా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. తొంద‌ర‌పాటుతో కాకుండా బౌలింగ్ శైలిని అర్థం చేసుకుంటూ అత‌డు ప‌రుగులు చేసే తీరు అద్భుత‌మ‌ని సోహైల్ ఖాన్ అన్నాడు.

ఫిట్‌నెస్‌పై ఆధార‌ప‌డి కోహ్లి భారీ స్కోర్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడ‌ని సోహైల్ ఖాన్ తెలిపాడు. కోహ్లి ఓ సింగిల్ తీసిన త‌ర్వాత మ‌రోసారి అదే ప్ర‌య‌త్నం చేస్తుంటాడ‌ని, కానీ రోహిత్ ఓ సింగిల్‌ త‌ర్వాత బ్యాట్‌కు ప‌నిచెబుతూ భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాడ‌ని అన్నాడు. కోహ్తి, రోహిత్ ల‌ను కంపేర్ చేస్తూ సోహైల్ ఖాన్ చేసిన కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి.