Rashid Khan 500 Wickets: టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ర‌షీద్‌ఖాన్-rashid khan completes 500 wickets in t20 format second bowler to achieve this record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rashid Khan Completes 500 Wickets In T20 Format Second Bowler To Achieve This Record

Rashid Khan 500 Wickets: టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ర‌షీద్‌ఖాన్

Nelki Naresh Kumar HT Telugu
Jan 23, 2023 11:05 PM IST

Rashid Khan 500 Wickets: టీ20 క్రికెట్‌లో ఆఫ్ఝ‌నిస్తాన్ స్పిన్న‌ర్ ర‌షీద్‌ఖాన్ అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు. టీ20 ఫార్మెట్‌లో 500 వికెట్లు తీసిన‌ రెండో బౌల‌ర్‌గా చ‌రిత్ర‌ను సృష్టించాడు.

ర‌షీద్‌ఖాన్
ర‌షీద్‌ఖాన్

Rashid Khan 500 Wickets: టీ20 క్రికెట్‌లో ఆఫ్ఝ‌నిస్తాన్ స్పిన్న‌ర్‌ ర‌షీద్‌ఖాన్ అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. పొట్టి ఫార్మెట్‌లో 500 వికెట్లు తీశాడు. ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న తొలి ఆసియా బౌల‌ర్‌గా ర‌షీద్‌ఖాన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్ర‌పంచ టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసుకున్న రెండో బౌల‌ర్‌గా ర‌షీద్‌ఖాన్ నిలిచాడు.

ఈ జాబితాలో 614 వికెట్ల‌తో వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ డ్వాన్ బ్రావో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో ఐదు వంద‌ల వికెట్ల‌ను అత్యంత వేగంగా తీసిన బౌల‌ర్ ర‌షీద్‌ఖాన్ కావ‌డం గ‌మ‌నార్హం. 368 ఇన్నింగ్స్‌ల‌లోనే ర‌షీద్‌ఖాన్ ఐదు వంద‌ల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

అత్య‌ధిక వికెట్ల జాబితాలో 474 వికెట్ల‌తో థ‌ర్డ్ ప్లేస్‌లో సునీల్ న‌రైన్ ఉండ‌గా 466 వికెట్ల‌తో ఇమ్రాన్ తాహిర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎమ్ఐ కేప్‌టౌన్ టీమ్‌కు ర‌షీద్‌ఖాన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

సోమ‌వారం ప్రిటోరియా కాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా టీ20లో 500 వికెట్ల ఘ‌న‌త‌ను ర‌షీద్‌ఖాన్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసి 16 ప‌రుగులు ఇచ్చిన ర‌షీద్‌ఖాన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

WhatsApp channel

టాపిక్