Pujara surpasses Vengsarkar: వెంగ్‌సర్కార్‌ను మించిన పుజారా.. ఇప్పుడు కోహ్లి తర్వాత అతడే-pujara surpasses vengsarkar to be the 8th highest run scorer in tests ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pujara Surpasses Vengsarkar To Be The 8th Highest Run Scorer In Tests

Pujara surpasses Vengsarkar: వెంగ్‌సర్కార్‌ను మించిన పుజారా.. ఇప్పుడు కోహ్లి తర్వాత అతడే

Hari Prasad S HT Telugu
Dec 14, 2022 08:25 PM IST

Pujara surpasses Vengsarkar: వెంగ్‌సర్కార్‌ను మించిపోయాడు చెతేశ్వర్‌ పుజారా. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 రన్స్‌ చేసిన పుజారా.. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యధిక రన్స్‌ చేసిన ఇండియన్‌ ప్లేయర్స్‌లో ఎనిమిదో స్థానానికి చేరాడు.

చెతేశ్వర్ పుజారా
చెతేశ్వర్ పుజారా (AP)

Pujara surpasses Vengsarkar: ఇండియా బ్యాటింగ్ లెజెండ్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ను మించిపోయాడు చెతేశ్వర్‌ పుజారా. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్‌ ప్లేయర్స్‌ లిస్ట్‌లో ఒక అడుగు పైకి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90 రన్స్‌ చేసిన పుజారా.. ఈ లిస్ట్‌లో వెంగ్‌సర్కార్‌ను వెనక్కి నెట్టి 8వ స్థానానికి చేరుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ అయినా కూడా ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్‌ టీమ్‌కు ఆడుతున్న వాళ్లలో విరాట్‌ కోహ్లి తర్వాతి స్థానం పుజారాదే కావడం విశేషం. వెంగ్‌సర్కార్‌ 116 టెస్టుల్లో 6868 రన్స్‌ చేశాడు. ఇక ఇండియా తరఫున 97వ టెస్ట్‌ ఆడుతున్న పుజారా ఈ ఇన్నింగ్స్‌తో 6882 రన్స్‌ చేశాడు. తద్వారా వెంగ్‌సర్కార్‌ను దాటి 8వ స్థానానికి చేరుకున్నాడు. పుజారా ఇప్పటి వరకూ 18 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీలు చేశాడు.

ఈ లిస్ట్‌లో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ 7212 రన్స్‌తో ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్‌ 8 లిస్ట్‌ చూస్తే ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వాళ్లు ఇద్దరే ఉన్నారు. ఒకరు విరాట్‌ కోహ్లి కాగా.. రెండోది పుజారా. ఈ లిస్ట్‌లో 15921 రన్స్‌తో సచిన్‌ టెండూల్కర్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక రన్స్‌ చేసిన ఇండియన్‌ ప్లేయర్స్‌

సచిన్‌ టెండూల్కర్‌ - 15921

రాహుల్‌ ద్రవిడ్‌ - 13265

సునీల్‌ గవాస్కర్‌ - 10122

వీవీఎస్‌ లక్ష్మణ్‌ - 8781

వీరేంద్ర సెహ్వాగ్‌ - 8503

విరాట్‌ కోహ్లి - 8075

సౌరవ్‌ గంగూలీ - 7212

చెతేశ్వర్‌ పుజారా - 6882

ఇప్పుడు ఇంకా క్రికెట్‌ ఆడుతున్న వాళ్లలో అజింక్య రహానే మాత్రమే పుజారాకు కాస్త దగ్గరగా ఉన్నాడు. రహానే 82 టెస్టుల్లో 4931 రన్స్‌ చేశాడు. ఇక ఇప్పడు బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ ఆడుతున్న టీమ్‌లో కోహ్లి, పుజారా తర్వాతి స్థానం అశ్విన్‌దే. అతడు టెస్టుల్లో 2931 రన్స్‌ చేశాడు.

WhatsApp channel