IPL 2022 LSG vs RR | టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. మరో విజయంపై కన్నేసిన రాహుల్‌-lsg won the toss and elected to field against rr in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 Lsg Vs Rr | టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. మరో విజయంపై కన్నేసిన రాహుల్‌

IPL 2022 LSG vs RR | టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. మరో విజయంపై కన్నేసిన రాహుల్‌

Hari Prasad S HT Telugu
Apr 10, 2022 07:06 PM IST

ఐపీఎల్‌లో కొత్త టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించి ఊపు మీదుంది. ఇప్పుడు రాజస్థాన్‌తో మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచింది.

టాస్ సందర్భంగా రెండు జట్ల కెప్టెన్లు సంజు శాంసన్, కేఎల్ రాహుల్
టాస్ సందర్భంగా రెండు జట్ల కెప్టెన్లు సంజు శాంసన్, కేఎల్ రాహుల్ (Hotstar)

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌. ఈ మ్యాచ్‌కు లక్నో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. లక్నో తరఫున స్టాయినిస్‌ ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేస్తున్నాడు. అటు రాజస్థాన్‌ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఫామ్‌లో లేని ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను రాజస్థాన్‌ తప్పించింది.

ఐపీఎల్‌ 2022లో కొత్త టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. ఇప్పుడు వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. అటు రాజస్థాన్‌ కూడా రెండు విజయాలతో ఊపు మీదుంది. ఈ రెండు టీమ్స్‌ మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది.

WhatsApp channel

టాపిక్