Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ విజేత‌గా ఆసియా ల‌య‌న్స్ - రాబిన్ ఊత‌ప్పదే హ‌య్యెస్ట్ స్ట్రైక్ రేట్ రికార్డ్‌-legends league cricket 2023 asia lions beat world giants by seven wickets in final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Legends League Cricket 2023 Asia Lions Beat World Giants By Seven Wickets In Final

Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ విజేత‌గా ఆసియా ల‌య‌న్స్ - రాబిన్ ఊత‌ప్పదే హ‌య్యెస్ట్ స్ట్రైక్ రేట్ రికార్డ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 21, 2023 07:58 AM IST

Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 విజేత‌గా ఆసియా ల‌య‌న్స్ నిలిచింది. సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్‌లో వ‌ర‌ల్డ్ జెయింట్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఆసియా ల‌య‌న్స్ విజ‌యాన్ని సాధించింది.

రాబిన్ ఉత‌ప్ప
రాబిన్ ఉత‌ప్ప

Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ స‌మ‌రం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్‌లో వ‌ర‌ల్డ్ జెయింట్స్‌పై ఆసియా ల‌య‌న్స్ ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వ‌ర‌ల్డ్ జెయింట్స్ జ‌ట్టు ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 147 ర‌న్స్ చేసింది. సౌతాఫ్రికా ఆల్ రౌండ‌ర్ జాక్ క‌లిస్ 54 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు ఐదు ఫోర్ల‌తో 78 ర‌న్స్ చేశాడు. అత‌డి త‌ర్వాత రాస్ టేల‌ర్ 32 ర‌న్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

ఆసియా ల‌య‌న్స్ బౌల‌ర్ల‌లో అబ్దుల్ ర‌జాక్ రెండు వికెట్లు తీసుకున్నాడు. వ‌ర‌ల్డ్ జెయింట్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 147 ప‌రుగుల టార్గెట్‌ను ఆసియా ల‌య‌న్స్ 16 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. ఓపెన‌ర్లు ఉప‌ల్ త‌రంగ, దిల్షాన్‌ హాఫ్ సెంచ‌రీల‌తో ఆసియా ల‌య‌న్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

త‌రంగ 28 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 57 ర‌న్స్ చేయ‌గా దిల్షాన్ 42 బాల్స్‌లో 58 ప‌రుగులు చేశారు. వీరిద్ద‌రి మెరుపుల‌తో ఆసియా ల‌య‌న్స్ ఈజీగా మ్యాచ్ గెలిచింది. అబ్దుల్ ర‌జాక్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా, ఉప‌ల్ త‌రంగ ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌గా నిలిచారు. విన్న‌ర్‌గా నిలిచిన ఆసియా ల‌య‌న్స్‌కు రెండు కోట్లు, ర‌న్న‌ర‌ప్ అయిన వ‌ర‌ల్డ్ జెయింట్స్‌కు కోటి రూపాయ‌లు ప్రైజ్ మ‌నీ ద‌క్కిన‌ట్లు స‌మాచారం.

రాబిన్ ఊత‌ప్ప హ‌య్యెస్ట్ స్ట్రైక్ రేట్‌

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజ‌న్‌లో హ‌య్యెస్ట్ స్ట్రైక్‌రేట్ క‌లిగిన ప్లేయ‌ర్‌గా రాబిన్ ఊత‌ప్ప నిలిచాడు. 173. 41 స్ట్రైక్ రేట్‌తో రాబిన్ ఊత‌ప్ప బ్యాటింగ్ చేశాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగ‌ర్స్ హార్బ‌జ‌న్ (13 ర‌న్స్ ఇచ్చి నాలుగు వికెట్లు), మూడు హాఫ్ సెంచ‌రీల‌తో గౌత‌మ్ గంభీర్‌, ఉప‌ల్ త‌రంగ హ‌య్యెస్ట్ ర‌న్ స్కోర‌ర్స్‌గా నిలిచారు.

WhatsApp channel

టాపిక్