KL Rahul Marriage : కేఎల్ రాహుల్ పెళ్లికి ఫోన్ అనుమతి లేదంట!-kl rahul athiya shetty s wedding will have no phone policy for guests ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kl Rahul Athiya Shetty's Wedding Will Have No Phone Policy For Guests

KL Rahul Marriage : కేఎల్ రాహుల్ పెళ్లికి ఫోన్ అనుమతి లేదంట!

Anand Sai HT Telugu
Jan 21, 2023 11:59 AM IST

KL Rahul Athiya Shetty Wedding : టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి పీటలెక్కుతున్నాడు. పెళ్లి కారణంగానే.. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నాడు. జనవరి 23న బాలీవుడ్ నటి అథియా శెట్టిని వివాహం చేసుకోనున్నాడు. అయితే పెళ్లి వేడుకకు వచ్చేవరికి కొన్ని రూల్స్ పెట్టారంట..!

అథియాతో కేఎల్ రాహుల్
అథియాతో కేఎల్ రాహుల్ (twitter)

కేఎల్ రాహుల్, అథియా శెట్టి వివాహం(KL Rahul Athiya Shetty Wedding) దగ్గరపడుతుంది. వీరిద్దరూ ఒకటి కానున్నారు. బాలీవుడ్ (Bollywood)సీనియర్ నటుడు సునీల్ శెట్టికి చెందిన విలాసవంతమైన ఖండలా బంగ్లాలో కేఎల్ రాహుల్, అథియా శెట్టిల పెళ్లి జరగనుంది. పెళ్లి వేడుకకు సంబంధించి.. ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే వివాహానికి హాజరవుతున్నప్పుడు అతిథులు అనుసరించాల్సిన కొన్ని విధానాలూ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

జనవరి 22న జరిగే మెహందీతో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయి. సాయంత్రం సంగీత్ ఉంటుంది. ఈ వేడుక శెట్టి ముంబయి హౌస్‌లో జరుగుతుంది. మరుసటి రోజు ఖండాలాలోని విలాసవంతమైన బంగ్లాలో వివాహం జరగనుందని తెలుస్తోంది. రెండు వైపుల నుండి 100 మంది అతిథులు వివాహానికి హాజరవుతారని, ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలను తీసు సోషల్ మీడియాలో పంచుకోవద్దని వచ్చే వారికి సూచనలు వెళ్లాయని తెలుస్తోంది.

పెళ్లి సమయంలో వారి మొబైల్ ఫోన్లు(Mobile Phone) కూడా దూరంగా ఉంచుతారు. ఖండాలాలో వివాహం జరిగిన కొన్ని వారాల తర్వాత, ఈ జంట ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. కేఎల్ రాహుల్(KL Rahul), అథియా శెట్టి పెళ్లి వేడుకకు షారుక్, అమీర్, హృతిక్ రోషన్, అమితాబ్, అక్షయ్‌తో పాటు క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కుటుంబసమేతంగా హాజరయ్యే అవకాశం ఉంది.

ప్రముఖ మీడియా ఫోటోగ్రాఫర్ వరీందర్ చావ్లా.. KL రాహుల్ అపార్ట్‌మెంట్ భవనం వెలుపలి భాగాన్ని వీడియో తీశారు. ఈ వీడియోలో భవనాన్ని రంగురంగుల లైట్లతో అలకరించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేఎల్ రాహుల్ పెళ్లికి సంబంధించినది కాదు. ఈ భవనం వేరేవారి వివాహానికి సంబంధించినది కావచ్చని తెలుస్తోంది.

వరీందర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు. 'సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అతియా శెట్టితో తన వివాహానికి ముందు భారత క్రికెటర్ KL రాహుల్ భవనం వెలుపల విజువల్స్.' అంటూ షేర్ చేశారు. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ కుటుంబాలు మాత్రం పెళ్లి గురించి మౌనంగానే ఉన్నాయి. జనవరి 23న వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం