Kapil on Kohli: కోహ్లీకి కపిల్ దేవ్ మద్దతు.. ఆస్ట్రేలియాపై 2-3 సెంచరీలు చేస్తాడని స్పష్టం-kapil dev missive prediction on viral kohli he can score 2 t0 3 centuries against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kapil On Kohli: కోహ్లీకి కపిల్ దేవ్ మద్దతు.. ఆస్ట్రేలియాపై 2-3 సెంచరీలు చేస్తాడని స్పష్టం

Kapil on Kohli: కోహ్లీకి కపిల్ దేవ్ మద్దతు.. ఆస్ట్రేలియాపై 2-3 సెంచరీలు చేస్తాడని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Feb 11, 2023 11:06 AM IST

Kapil on Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ విఫలంకావడంతో విమర్శలు వస్తున్న వేళ.. కపిల్ అతడికి అనుకూలంగా మాట్లాడాడు. కోహ్లీ ఆసీస్ సిరీస్‌లో 2,3 సెంచరీలు చేస్తాడని స్పష్టం చేశాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Kapil on Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో విఫలమైన సంగతి తెలిసిందే. అరంగేట్రం ఆసీస్ బౌలర్ టాడ్ మర్ఫీ వేసిన సాధారణ బంతికే అతడు పెవిలియన్ చేరడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కేవలం 12 పరుగులు మాత్రమే చేసి మర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో కోహ్లీపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. వీటిపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సమాధానమిచ్చారు. అతడు సామర్థ్యంపై సందేహపడకూడదని కోహ్లీని వెనకేసుకొచ్చారు.

"అతడు(విరాట్ కోహ్లీ) ప్రభావం చూపిస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతడిలో ఇంకా పరుగులు దాహం తీరలేదు. తొలి మ్యాచ్ చాలా ముఖ్యమైంది. ఒకవేళ అతడు పరుగులు చేయడం ఆరంభిస్తే తనదైన శైలిలో చేస్తాడు. మొదటి టెస్టుకు అతడి లాంటి స్టార్ ఆటగాడు ఎప్పుడూ ముఖ్యమే. అతడు 50 పరుగులు చేసినా.. ఈ సిరీస్‌లో అతడు మరో 2,3 శతకాలు చేస్తాడని నేను ఊహించగలను. ఇరుజట్లు రెండు అవకాశాలు ఉంటాయి. అది మనస్సులో పెట్టుకోవాలి." అని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం నాగపుర్ పిచ్‌పై జరుగుతున్న చర్చపై కూడా కపిల్ దేవ్ మాట్లాడారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ ఇరుజట్లు 350 నుంచి 400 స్కోరును విజయవంతంగా చేస్తాయని తెలిపారు.

"టర్నింగ్ పిచ్‌లు గురించి వింటున్నాం. జట్లు 600 స్కోరు చేస్తుందని చెప్పలేం కానీ, ఒకవేళ చేస్తే ఇరుజట్ల బ్యాటర్లకు అనుకూలించవచ్చు. పిచ్‌లు బ్యాటర్ల చేతిలోనే ఉంటాయి. ఈ రోజుల్లో 60 శాతం పిచ్‌లు బౌలర్ల పక్షాన నిలుస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని 400 పరుగులు చేస్తాం అని చెప్పలేకపోవచ్చు. కానీ 220 నుంచి 250 మధ్య చేయొచ్చు. 350 స్కోరంటే చాలా పెద్దది ఫీలింగ్ కలుగుతుంది. పిచ్‌లు బాగుంటే విరాట్ కోహ్లీ కచ్చితంగా పరుగులు చేస్తాడు." అని కపిల్ దేవ్ తెలిపారు.

WhatsApp channel