Ishan Kishan Interaction With Fans: రెండో వ‌న్డే అనంత‌రం అభిమానుల‌తో ఇషాన్ సెల్ఫీలు - వీడియో వైర‌ల్‌-ishan kishan interact with fans after 2nd odi in ranchi video goes viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ishan Kishan Interact With Fans After 2nd Odi In Ranchi Video Goes Viral

Ishan Kishan Interaction With Fans: రెండో వ‌న్డే అనంత‌రం అభిమానుల‌తో ఇషాన్ సెల్ఫీలు - వీడియో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 10, 2022 01:36 PM IST

Ishan Kishan Interaction With Fans: రెండో వ‌న్డే మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఇషాన్ కిష‌న్ రాంచీ స్టేడియం స్టాండ్స్‌లో సంద‌డి చేశాడు. అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీలు దిగాడు. బీసీసీఐ ఈ వీడియోను షేర్ చేసింది.

ఇషాన్ కిష‌న్
ఇషాన్ కిష‌న్ (Twitter)

Ishan Kishan Interaction With Fans: సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో ఇషాన్ కిష‌న్ 93 ప‌రుగుల‌తో స‌త్తా చాటాడు. ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అభిమానుల‌ను అల‌రించాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ ఏడు సిక్స‌ర్లు కొట్ట‌డం గ‌మ‌నార్హం. ఇషాన్ కిష‌న్‌తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా బ్యాటింగ్‌లో రాణించ‌డంతో ఏడు వికెట్ల తేడాతో రెండో వ‌న్డేలో టీమ్ ఇండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఇషాన్ కిష‌న్ జేఎస్‌సీఏ స్టేడియం స్టాండ్స్‌లో సంద‌డి చేశాడు. అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీలు దిగాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ఈ స్టేడియంలో ప‌లు మ్యాచ్‌లు ఆడాడు ఇషాన్ కిష‌న్‌. ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ స్టాండ్స్ మొత్తం చ‌క్క‌ర్లు కొట్టాడు. అత‌డితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీప‌డ్డారు.

అంద‌రితో ఇషాన్ ఫొటోలు దిగాడు. ఓ అభిమాని శార్ధూల్ ఠాకూర్ పేరుతో పాటు 54 ల‌వ్ సింబ‌ల్ రాసి ఉన్న ఓ పేప‌ర్‌ను ఇషాన్ కిష‌న్‌కు ఇచ్చాడు. ఇది శార్ధూల్‌కు అందించ‌మ‌ని ఆ అభిమాని ఇషాన్‌ను కోరాడు. అభిమాని కోరిన‌ట్లుగానే ఆ పేప‌ర్‌ను శార్ధూల్‌కు ఇషాన్ అంద‌జేశాడు. ఇషాన్ స్టాండ్స్ లో సంద‌డి చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

WhatsApp channel