India vs Australia 3rd test: సగం వికెట్లు కోల్పోయిన భారత్.. చెలరేగుతోన్న ఆసీస్ స్పిన్నర్లు.. పుజారా చెత్త రికార్డు -india lost 5 wickets aginst australia in 3rd test 1st innings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Lost 5 Wickets Aginst Australia In 3rd Test 1st Innings

India vs Australia 3rd test: సగం వికెట్లు కోల్పోయిన భారత్.. చెలరేగుతోన్న ఆసీస్ స్పిన్నర్లు.. పుజారా చెత్త రికార్డు

Maragani Govardhan HT Telugu
Mar 01, 2023 11:09 AM IST

India vs Australia 3rd test: ఇండోర్ వేదకగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ అప్పుడే సగం వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, గిల్, పుజారా, జడేజా, శ్రేయస్ అయ్యర్ వికెట్లును కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, శ్రీకర్ భరత్ ఉన్నారు.

లియోన్ బౌలింగ్ లో బౌల్డయిన పుజారా
లియోన్ బౌలింగ్ లో బౌల్డయిన పుజారా (AFP)

India vs Australia 3rd test: ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభం అస్సలు కలిసి రాలేదు. జట్టు స్కోరు 50 కూడా కాకముందే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్ మ్యాథ్యూ కుహ్నేమాన్ తన స్పిన్ మాయాజాలంతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. రోహిత్ శర్మ సహా మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పక్క ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లయన్ కూడా రెండు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు.

ట్రెండింగ్ వార్తలు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ 12 పరుగులు చేసి స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. మ్యాథ్యూ కుహ్నేమన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే పుజారా నాథన్ లియోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాను కూడా ఔట్ చేశాడు లియోన్. ఆ కాసేపటికే శ్రేయాస్ అయ్యర్‌ను కుహ్నేమన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. భారత్.

ఈ మ్యాచ్‌లో పుజారా తన పేరిట ఓ చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఓ బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన భారత బ్యాటర్‌గా నిలిచాడు. నాథన్ లియోన్ బౌలింగ్‌లో పుజారా ఔట్ కావడం ఇది 12 సారి. ఇంగ్లీష్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లోనూ పుజారా 12 సార్లు ఔటయ్యాడు. టీమిండియా తరఫున సునీల్ గవాస్కర్.. అండర్‌వుడ్ చేతిలో 12 సార్లు ఔటై ఆ రికార్డును సమం చేశాడు. గవాస్కర్ తర్వాత ఓ బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన రెండో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు.

ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రీకర్ భరత్ ఉన్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బౌలర్లు ధాటిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం 19 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం