Ind W vs Pak W in Asia Cup: టాస్ గెలిచిన పాకిస్థాన్.. ఇండియా జోరు కొనసాగుతుందా?
Ind W vs Pak W in Asia Cup: మహిళల ఆసియాకప్‌లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న ఇండియన్ టీమ్ ఆ జోరు కొనసాగిస్తుందా లేదా చూడాలి.
Ind W vs Pak W in Asia Cup: మహిళల ఆసియాకప్‌లో శుక్రవారం (అక్టోబర్ 7) మరో కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ కీలకమైన మ్యాచ్‌కు తిరిగి తుది జట్టులోకి వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
దీంతో గత మ్యాచ్ ఆడిన కేపీ నవ్‌గిరె తప్పుకుంది. ఇక స్నేహ్ రాణా స్థానంలో రాధా యాదవ్‌ను తీసుకున్నారు. ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కైనత్ ఇంతియాజ్, డయానా బేగ్‌ల స్థానంలో సాదియా ఇక్బాల్, ఐమన్ అన్వర్ టీమ్‌లోకి వచ్చారు.
ఇండియా తుది జట్టు: స్మృతి మంధానా, మేఘన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దయాలన్ హేమలత, రిచా ఘోష్, పూజా వస్త్రకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్
పాకిస్థాన్ తుది జట్టు: మునీబా అలీ, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్, నిదా దర్, అయేషా నసీమ్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఐమన్ అన్వర్, సాదియా ఇక్బాల్, తుబా హసన్, నష్రా సంధు