Chetan Sharma On Virat Kohli: టీమ్ ఇండియాలో రెండు గ్రూపులు - దుమారం రేపుతోన్న‌ చేత‌న్ శ‌ర్మ కామెంట్స్‌-chetan sharma says indian cricketers take injection to prove their fitness
Telugu News  /  Sports  /  Chetan Sharma Says Indian Cricketers Take Injection To Prove Their Fitness
విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌
విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌

Chetan Sharma On Virat Kohli: టీమ్ ఇండియాలో రెండు గ్రూపులు - దుమారం రేపుతోన్న‌ చేత‌న్ శ‌ర్మ కామెంట్స్‌

15 February 2023, 10:13 ISTNelki Naresh Kumar
15 February 2023, 10:13 IST

Chetan Sharma On Virat Kohli: టీమ్ ఇండియా రెండు గ్రూపులుగా విడిపోయిందంటూ చీఫ్ సెలెక్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ చేసిన కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఫిట్‌నెస్ కోసం క్రికెట‌ర్లు ఇంజెక్ష‌న్స్‌ వాడుతుంటార‌ని కామెంట్స్ చేశాడు.

Chetan Sharma On Virat Kohli: టీమ్ ఇండియా చీఫ్ సెలెక్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ చేసిన కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో దుమారం రేపుతున్నాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌తో పాటు బీసీసీఐ తీరుపై చేత‌న్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఓ ఛానెల్ నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో చేత‌న్ శ‌ర్మ మాట్లాడుతూ ఫామ్‌లో లేని ఆట‌గాళ్లు కొంద‌రు ఫిట్‌నెస్ సామ‌ర్థ్యాన్ని నిరూపించుకోవ‌డం కోసం కొన్ని ఇంజెక్ష‌న్స్ వాడుతుంటార‌ని అన్నాడు. ఆ ఇంజెక్ష‌న్స్‌లో ఉప‌యోగించే డ్ర‌గ్‌ను డోపింగ్ టెస్ట్‌లు కూడా క‌నిపెట్ట‌లేని అన్నాడు.

రెండు గ్రూప్‌లుగా టీమ్ ఇండియా

ప్ర‌జెంట్ టీమ్ ఇండియా పైకి ఐక‌మ‌త్యంగానే క‌నిపిస్తోన్న జ‌ట్టులో రెండు గ్రూపులు ఉన్నాయ‌ని చేత‌న్ శ‌ర్మ చెప్పాడు. ఓ గ్రూప్‌కు రోహిత్ లీడ‌ర్ అయితే మ‌రో గ్రూప్‌కు విరాట్ నాయ‌కుడిగా ఉన్నాడ‌ని చెప్పాడు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తొల‌గించే విష‌యంలో బీసీసీఐ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని చేత‌న్ శ‌ర్మ అన్నాడు.

కోహ్లి పూర్ ఫామ్‌ను సాకుగా చూపించి రోహిత్‌ను కెప్టెన్‌గా నియ‌మించింద‌ని చెప్పాడు. రోహిత్ అంటే బీసీసీఐ మెంబ‌ర్స్‌లో చాలా మందికి ఇష్టం లేక‌పోయినా కోహ్లికి వ్య‌తిరేకంగా కావాల‌నే ఇదంతా చేశార‌ని చెప్పాడు. ఇండియా నంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్స్ ప‌ట్ల బీసీసీఐ ప్ర‌వ‌ర్తించిన తీరు సిగ్గుచేటుగా ఉంద‌ని పేర్కొన్నాడు.

ఈగో ఇష్యూస్‌...

కోహ్లి రోహిత్ మ‌ధ్య చ‌క్క‌టి సంత్సంబంధాలు ఉన్నాయ‌ని చేత‌న్ శ‌ర్మ పేర్కొన్నాడు. కోహ్లి బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న స‌మ‌యంలో అత‌డికి రోహిత్ అండ‌గా నిలిచాడ‌ని తెలిపాడు. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ఈగోనే కొన్నిసార్లు స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంద‌ని చేత‌న్ శ‌ర్మ అన్నాడు.

చేత‌న్ శ‌ర్మ చేసిన ఈ కామెంట్స్ క్రికెట్ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌స్తుతం టీమ్ ఇండియాకు సెకండ్ లెవెల్ చీఫ్ సెలెక్ట‌ర్‌గా చేత‌న్ శ‌ర్మ కొన‌సాగుతోన్నాడు. అత‌డి కామెంట్స్‌పై బీసీసీఐ సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.