Axar Patel: ధోనీ అరుదైన రికార్డ్‌ను బ్రేక్ చేసిన అక్ష‌ర్ ప‌టేల్‌-axar patel surpass dhoni 17 years old record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Axar Patel Surpass Dhoni 17 Years Old Record

Axar Patel: ధోనీ అరుదైన రికార్డ్‌ను బ్రేక్ చేసిన అక్ష‌ర్ ప‌టేల్‌

HT Telugu Desk HT Telugu
Jul 25, 2022 11:51 AM IST

ఆదివారం వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో చ‌క్క‌టి బ్యాటింగ్ టీమ్ ఇండియాను గెలిపించాడు ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌ (Axar patel). ఈ క్ర‌మంలో ధోనీ (Ms Dhoni)ప‌దిహేడు ఏళ్ల క్రితం నెల‌కొల్పిన రికార్డును అక్ష‌ర్ అధిగ‌మించాడు. ఆ రికార్డ్ ఏదంటే...

అక్ష‌ర్ ప‌టేల్‌
అక్ష‌ర్ ప‌టేల్‌ (twitter)

India vs West Indies Second Odi: అక్ష‌ర్ ప‌టేల్ వీరోచిత బ్యాటింగ్‌తో వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త్ విజ‌యాన్ని అందుకున్న‌ది. ప‌ది ఓవ‌ర్ల‌లో వంద ప‌రుగులు చేయాల్సిన త‌రుణంలో ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగిన అక్ష‌ర్ ప‌టేల్ మెరుపు బ్యాటింగ్‌తో టీమ్ ఇండియాకు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు. 35 బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 64 ర‌న్స్ చేశాడు అక్ష‌ర్ ప‌టేల్‌. సంజూ శాంస‌న్ (54 ర‌న్స్‌), శ్రేయ‌స్ అయ్య‌ర్ (63 ర‌న్స్)హాఫ్ సెంచ‌రీల‌తో రాణించ‌డంతో టీమ్ ఇండియా విజ‌యాన్ని అందుకున్న‌ది. వ‌న్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవ‌సం చేసుకున్న‌ది. సిక్స‌ర్‌తో టీమ్ ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు అక్ష‌ర్ ప‌టేల్‌.

ఈ క్ర‌మంలో ప‌దిహేడేళ్ల క్రితం ధోనీ నెల‌కొల్పిన అరుదైన రికార్డును అక్ష‌ర్ ప‌టేల్ అధిగ‌మించాడు. వ‌న్డే క్రికెట్ లో ల‌క్ష్య ఛేద‌న‌లో ఏడు లేదా అంత‌కంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్ దిగి అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త ప్లేయ‌ర్‌గా కొత్త రికార్డు నెల‌కొల్పాడు. గ‌తంలో 2005లో జింబాబ్వేపై ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగి మూడు సిక్స‌ర్లు కొట్టాడు. ధోనీతో స‌మానంగా మూడు సిక్స‌ర్ల‌తో యూసుఫ్ ప‌ఠాన్ నిలిచాడు. 2011లో సౌతాఫ్రికా, ఐర్లాండ్‌ల‌పై యూసుఫ్ ఈ రికార్డు నెల‌కొల్పాడు. తాజాగా వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా ఐదు సిక్స‌ర్ల‌తో అక్ష‌ర్ ప‌టేల్ ధోనీ, యూసుఫ్ రికార్డుల‌ను తిర‌గ‌రాశాడు. అంతేకాకుండా వెస్టిండీస్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ సాధించిన రెండో ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా అక్షర్ ప‌టేల్ రికార్డు సాధించాడు. అక్ష‌ర్‌కు వ‌న్డేల్లో ఇదే తొలి హాఫ్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్