Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి చెక్ చేయండి-weekly horoscope in telugu check your astrology for this week form 8th october to 14th octorber 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి చెక్ చేయండి

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి చెక్ చేయండి

HT Telugu Desk HT Telugu
Oct 08, 2023 01:09 AM IST

Weekly Horoscope in telugu: ఈవారం రాశి ఫలాలు తేదీ 08.10.2023 నుండి 14.10.2023 వరకు జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఇక్కడ తెలుసుకోండి.

ఈ వారం రాశి ఫలాలు
ఈ వారం రాశి ఫలాలు (pixabay)

తెలుగు రాశిఫలితములు (వార ఫలితము) 08.10.2023 నుండి 14 10.2023 వరకు, సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : దక్షిణాయనం, మాసం : భాద్రపదం

మేషరాశి

మేషరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను చేపడతారు. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు సకలంలో పూర్తి అవుతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడును. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటబడతారు. శుభవార్తలు వింటారు. అదనపు రాబడి ఉంటుంది. సమాజంలో గౌరవం కలుగును. మేషరాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్దాదేవిని, సుబ్రహ్మణ్యుణ్జి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభథరాశివారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా కొద్దిగా చికాకులు. ఉద్యోగస్తులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు అవకాశాలు అప్యయత్నంగా లభిస్తాయి. వ్యాపారాలు గతంలో కంటే లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలించును. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. వృథా ఖర్చులు ఏర్పడును. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్దాదేవిని పూజించాలి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిలో అనుకోని బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు చిక్కుల వీడి ఉపశమనం లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అరోగ్య సమస్యలు. ధన వ్యయం. దూర ప్రయాణాలు. మిథునరాశివారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ బాధ్యతలు సమర్దవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులకు ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా బలపడతారు. అరోగ్య సమస్యలు ఏర్పడును. కర్కాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహరాశి

సింహరాశి వారికి ఈవారం మీకు మధ్యస్థముగా ఉన్నది. ఆర్థిక పరిస్థితి అనుకూలించును. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. రాజకీయ నాయకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వృధా ఖర్చులు. సోదరులతో వివాదాలు తొలగుతాయి. ప్రముఖుల నుంచి అతి ముఖ్య సమాచారం రాగలదు. విద్యార్థులకు అనుకూలం. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేకపోయినప్పటికి ఏదోవిధంగా అవసరాలు తీరతాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయత్నం. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలం. కళాకారులకు మరింత ఉత్సాహం. మానసిక అశాంతి కలుగును. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ వారం మీకు కొంత అనుకూలంగా ఉన్నది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యలతు రాగలవు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. దీర్హకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. అప్పులు తీరతాయి. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృళ్చిక రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడుతు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పనుల్లో చికాకులు తొలగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ధన వ్యయం. కుటుంబ సమస్యలు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు మీపై వేసుకుంటారు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. బంధువులతో విరోధాలు కలుగును. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి జాష్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఆశ్చర్యపరుస్తాయి. మానసిక అశాంతి. కుటుంబములో ఒత్తిడులు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. కొత్త రుణాలకు ప్రయత్నాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలలో మార్పులు, ముఖ్యుల సలహాలు పాటిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. శుభవార్తలు వింటారు. స్వల్చ ధనలాభం కలుగును. భాగస్వామ్య వ్యాపారాలలో సామాన్య లాభాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కలిగి మరింత విస్తరిస్తారు. ఉ ద్యోగులకు అనుకూలం. వృథా ఖర్చులుండును. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కష్టసాధ్యమైన పనులు కూడా లెక్కచేయక పూర్తి చేస్తారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

WhatsApp channel