Today Rasi phalalu: ఈరోజు రాశి ఫలాలు.. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి-today rasi phalalu check astrological predications in telugu for 12 moon signs on tues day june 6 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu Check Astrological Predications In Telugu For 12 Moon Signs On Tues Day June 6 2023

Today Rasi phalalu: ఈరోజు రాశి ఫలాలు.. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 01:02 AM IST

Today Rasi phalalu: ఈరోజు రాశి ఫలాలు 06.06.2023 కోసం పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు చంద్రమానం ప్రకారం 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ చదవొచ్చు.

ఈరోజు రాశి ఫలాలు
ఈరోజు రాశి ఫలాలు

Today Rasi phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 06.06.2023వ తేదీ మంగళ వారం కోసం పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టము

వారం: మంగళవారం, తిథి: కృ తదియ నక్షత్రం: పూర్వాషాఢ

మేష రాశి ఈరోజు రాశి ఫలాలు

మేషరాశి జాతకులకు ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. చికాకులు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మేషరాశికి జన్మస్థానము నందు బుధ, గురు, రాహువుల వాక్‌ స్థానం నందు రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానము నందు కుజ, శుక్రుల ప్రభావం చేత కుటుంబ విషయాలయందు చికాకులు ఏర్పడు సూచన. పనులు యందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి వారికి శనియొక్క అనుకూల స్థితివలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు.

ఈరోజు సుబ్రహ్మణ్యేశరుణ్ణి పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

ఈరోజు వృషభరాశి ఫలితాలు

వృషభరాశి జాతకులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యయ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ప్రయాణములు, ఖర్చులు అధికముగా ఉండును. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు ఉండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. వృషభరాశి వారికి దశమమునందు శని ప్రభావంచేత ఆర్థికపరంగా లాభము చేకూరును.

ఈరోజు వృషభ రాశి వారు దుర్గా దేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథునరాశి ఈరోజు రాశి ఫలాలు

మిథునరాశి వారికి ఈ వారం మధ్యస్థముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి వాక్‌ స్థానమునందు కుజుడు, వ్యయస్థానము నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన ఆవేశపూరిత నిర్ణయాల వల్ల చికాకులు ఇబ్బందులు కలుగుగును. వివాదాలు ఏర్చడు సూచన. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుట చేత మిథునరాశివారికి కొన్ని పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము.

ఈరోజు మిథున రాశి వారు విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

ఈరోజు కర్కాటక రాశి దినఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మరాశియందు కుజుని, అష్టమ శని ప్రభావంచేత శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఏర్పడును. లాభస్థానము నందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములయందు కుటుంబ వ్యవహారముల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉందును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గా దేవిని పూజించండి.

సింహరాశి ఈరోజు రాశి ఫలాలు

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యయస్థానములో కుజ, శుక్రుల సంచారంచేత ఖర్చులు అధికమగును. ఇష్టమైన వస్తువులు కొనే ప్రయత్నం చేసెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమ స్థానములో రవి ప్రభావం చేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా జరుగు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్థికమపరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబ విషయాల యందు, ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి.

ఈరోజు సింహ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యారాశి ఈరోజు రాశిఫలాలు

కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార విషయాలు లాభించును. కన్యారాశి వారికి లాభస్థానములో కుజ, శుక్రుల ప్రభావంచేత ధనలాభము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమస్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్ధితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును.

ఈరోజు కన్యా రాశి వారు దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

ఈరోజు తులా రాశి జాతకం

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. దశమ స్థానమునందు కుజ, శుక్రుల ప్రభావంచేత తులారాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్చడును. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు చికాకులు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలము. కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

ఈరోజు తులారాశి వారు విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చికరాశికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కళత్ర స్థానమునందు రవి ప్రభావం చేత కుటుంబమునందు సమస్యలు

ఏర్పడు సూచన. అర్జాష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనూ రాశి నేటి రాశి ఫలితాలు

ధనూరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ కుజ, శుక్రుల ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడు సూచన. ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉందెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము.

ఈరోజు సుబ్రహ్మణ్యేశరుణ్ణి పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి ఈరోజు రాశి ఫలాలు

మకరరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రయాణములు అనుకూలించును. ఆరోగ్యము అనుకూలించును. ఖర్చులు పెరుగు సూచన. చతుర్ధ స్థానము నందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన, పంచమ స్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఈ జాతకులు ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి.

నేడు దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

నేటి కుంభ రాశి ఫలితాలు

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. ఏలినాటిశని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరో స్థానమునందు కుజ, శుక్రులు ప్రభావంచేత శత్రు పీడ అధికమగును. పనులయందు ఆలస్యములు ఏర్పడినప్పటికి అనుకున్న పనులు ఏదోవిధంగా పూర్తి చేసెదరు. ధనపరమైనటువంటి విషయాలయందు శ్రమ అధికమగును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును.

కుంభ రాశి జాతకులు నేడు విఘ్నేశ్వరుని పూజించాలి సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి ఈరోజు రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. ప్రయాణాలు అనుకూలించును. ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేసెదరు. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు చేయడానికి అనుకూలంగా లేనటువంటి సమయము. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉందును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

మీనరాశి వారు ఈరోజు బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గా దేవిని పూజించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel