Today Horoscope : నేటి రాశిఫలాలు : ఈరోజు శివారాధన చేస్తే.. ఆ రాశివారికి శుభఫలితాలు-today horoscope in telugu based on career and life for 14th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 14th September 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : ఈరోజు శివారాధన చేస్తే.. ఆ రాశివారికి శుభఫలితాలు

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 14, 2022 06:24 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 14వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (14-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశిఫలం

మేషరాశివారికి మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంది. సుఖ భోజన ప్రాప్తి ఉంటుంది. ద్వితీయంలో కుజుని ప్రభావం ఉంది కాబట్టి వాగ్వాదాలు జరిగే అవకాశముంది. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనాన్ని కొంత అధికంగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

వృషభ రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. ధన వ్యయం అధికముగా ఉండును. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శివారాధన చేస్తే కొంత శుభఫలితాలు కలిగే అవకాశాలున్నవి.

మిథున రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ ఆచితూచి ముందుకు వెళ్లటం మంచిది.

కర్కాటక రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అనుకున్న ప్రతీ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషము, కీర్తి కలుగును. విష్ణు ఆరాధన చేయడం వల్ల శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశిఫలం

మీకు ఈరోజు మధ్యస్తంగా ఉంది. కోపము, గొడవలు అధికముగా ఉండును. ఉద్యోగాలలో అనుకూలత లోపించును. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు. విష్ణు సహస్ర నామం పారాయణం చేయటం మంచిది.

కన్య రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. విష్ణు ఆరాధన చేస్తే శుభఫలితాలు పొందుతారు.

తుల రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభం, వస్తులాభం కలుగుతాయి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతీ పనిలోనూ విజయము సాధిస్తారు. ధనలాభము, కీర్తి లాభము కలదు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు.

ధనుస్సు రాశిఫలం

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. చేసే ప్రతీ పనిలోనూ ఆటంకములు, హాని, ఇబ్బందులు కలుగును. మనస్సుని నియంత్రణలో ఉంచుకుంటే మంచిది. మరింత శుభ ఫలితాల కోసం విష్ణు సహస్ర నామం పారాయణం చేయండి.

మకర రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉన్నది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చేసే ప్రతీ పనియందు ఆందోళనలు కలుగును. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. విష్ణు ఆరాధన చేస్తే శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభము చేకూరుతుంది. ఏలినాటి శని ఉన్నప్పటికి చేసే ప్రతి పనియందు విజయము పొందుతారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. విష్ణు ఆరాధన చేత శుభఫలితాలు పొందెదరు.

మీనం రాశిఫలం

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. కొన్ని ప్రత్యేక వస్తువులను కొంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్