Today Horoscope : నేటి రాశిఫలాలు : ఆ రాశివారిపై అష్టమ శని ప్రభావం.. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది..-today horoscope in telugu based on career and life for 13th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 13th September 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : ఆ రాశివారిపై అష్టమ శని ప్రభావం.. ఆచితూచి వ్యవహరిస్తే మంచిది..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 13, 2022 06:19 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 13వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (12-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశిఫలం

మేషరాశివారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంది. సౌఖ్యమును పొందెదరు. ద్వితీయంలో కుజుని ప్రభావం ఉంది. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాగ్వాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ధన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

వృషభ రాశిఫలం

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. పలు అవసరాల కోసం ధనమును ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించుట మంచిది. దుర్గాదేవి ఆరాధన చేత కొంత శుభఫలితాలు ఉంటాయి.

మిథున రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. అష్టమ శని ప్రభావం చేత ప్రతీ పనిలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అనుకున్న ప్రతీ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం ఉత్తమం.

సింహ రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి విషయమునందు ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభఫలితాలు కలుగును.

కన్య రాశిఫలం

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. పనులను చాకచక్యంతో పూర్తి చేస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తుల రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభం, వస్తులాభం కలుగు సూచనలు ఉన్నాయి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతీ పనిలోనూ విజయము సాధిస్తారు. ధనలాభము, కీర్తి లాభము ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు.

ధనుస్సు రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. చేసే ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మనస్సుని నియంత్రణలో ఉంచుకుంటే ఇంకా మంచిది. మరింత శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలి.

మకర రాశిఫలం

ఈరోజు ప్రతి పనిలోనూ మీకు అనుకూల ఫలితములు వస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఏలినాటి శని ప్రభావంచేత పనుల్లో కొంత జాప్యం ఉంటుంది. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తే మంచిది.

కుంభ రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని ప్రభావంచేత పనులలో కొంత ఇబ్బందులు కలుగవచ్చు. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. దుర్గాదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు ఉంటాయి.

మీనం రాశిఫలం

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Mobile : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్