Today Horoscope : నేటి రాశిఫలాలు : ఇతరులకు మేలు చేద్దామనుకుంటే.. మీరు ఇబ్బందుల్లో పడతారు..-today horoscope in telugu based on career and life for 10th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Horoscope : నేటి రాశిఫలాలు : ఇతరులకు మేలు చేద్దామనుకుంటే.. మీరు ఇబ్బందుల్లో పడతారు..

Today Horoscope : నేటి రాశిఫలాలు : ఇతరులకు మేలు చేద్దామనుకుంటే.. మీరు ఇబ్బందుల్లో పడతారు..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 10, 2022 06:29 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 10వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (10-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశిఫలం

మేషరాశివారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ప్రతీపనిలో సమస్యలు, ఆటంకములు అధికముగా ఉండును. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే శుభఫలితాలను పొందుతారు.

వృషభ రాశిఫలం

వృషభరాశి వారికి ఈ రోజు మానసిక వేదనలు, ఒత్తిడులు, అనారోగ్య సూచనలు ఉన్నాయి. అయినా సరే బృహస్పతి, శని అనుకూల స్థితివలన ప్రతీ పనియందు విజయాన్ని పొందుతారు. ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

మిథున రాశిఫలం

మిథునరాశివారికి ఈ రోజు ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రతీ పనిలో ఆలస్యము, చికాకులు కలుగుతాయి. శుభ ఫలితాలను పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

కర్కాటక రాశిఫలం

కర్కాటక రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. శివునికి అభిషేకం చేసుకుంటే మరిన్ని శుభఫలితాలను పొందుతారు.

సింహ రాశిఫలం

సింహరాశివారికి ఈ రోజు ప్రతీపని అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. మరిన్ని శుభఫలితాలను పొందుటకు సూర్యాష్టకాన్ని పఠించాలి.

కన్య రాశిఫలం

కన్యారాశివారికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఇతరులకు మేలు చేద్దామని మీరుభావిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తుల రాశిఫలం

తులరాశివారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చికాకులు, సమస్యలు అధికముగా ఉంటాయి. ప్రతివిషయములో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని పూజిస్తే మంచిది.

వృశ్చిక రాశిఫలం

వృశ్చికరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీపనియందు విజయము సాధిస్తారు. మరిన్ని శుభఫలితాలను పొందడానికి విఘ్నేశ్వరుని పూజించడం మంచిది.

ధనుస్సు రాశిఫలం

ధనూరాశివారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మకర రాశిఫలం

మకర రాశివారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. శనికి తైలాభిషేకం, వేంకటేశ్వరస్వామి పూజ చేసుకుంటే మంచిది.

కుంభ రాశిఫలం

కుంభరాశివారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడుకున్న వారం ఇది. మరిన్ని శుభఫలితాలు పొందాలని అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, వేంకటేశ్వరస్వామిని పూజించడం చేయాలి.

మీనం రాశిఫలం

మీనరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Email : www.chilakamarthy.com

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం