Budh Transit Horoscope : మకర సంక్రాంతి సమయంలో ఆ 3 రాశుల వారికి అదృష్టం..
Budh Gochar 2023 Astrology : మకర సంక్రాంతిలో బహుళ గ్రహాల సంచారం ఆసన్నమైందని వేద జ్యోతిషశాస్త్రం చెప్తోంది. ఇది 12 రాశిచక్రాలపై కొంత ప్రభావం చూపనుంది. త్రిగ్రాహి యోగా మకర సంక్రాంతి సమయంలో మాత్రమే కనిపిస్తుంది. ఆ సమయంలోనే బుధ సంచారం పూర్తవుతుంది. దీని వల్ల ఏయే రాశుల వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury Transit in Sagittaurs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు డిసెంబర్ 31, 2022లో ధనుస్సు రాశిలో వాలుగా ఉన్నాడు. ఆపై జనవరి 2, 2023 న.. అదే రాశిలోకి వచ్చాడు. ఆ తర్వాత జనవరి 13న బుధుడు.. ధనుస్సు రాశిలో ఉదయిస్తాడు. జనవరి 14న మకర సంక్రాంతికి ముందు.. జనవరి 13న బుధుడు ఉదయించడం వల్ల పలు రాశులవారికి శుభ ఫలితాలు కలుగనున్నాయి. ఇంతకీ ఏయే రాశులవారికి బుధుడి వల్ల ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటకం
కర్కాటకం రాశి స్థానికులపై బుధుడు ప్రభావం అనేక సానుకూల ఫలితాలను చూపుతుంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఏదైనా ఆస్తి లేదా డబ్బు ఎక్కువ కాలం నిలిచిపోయి ఉంటే.. అది ఈసారి మీకు లభిస్తుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు. ఏదైనా చట్టపరమైన సమస్యలలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు.
వృశ్చిక రాశి
బుధుడు వృశ్చిక రాశి వారికి స్వామిగ్రహం. బుద్దేవుడు స్థానికుల రెండవ ఇంట్లో ఉన్నాడు. మీరు మీ వ్యాపారాన్ని.. ఇంకా ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇది ఆర్థిక లాభాలకు బలమైన అవకాశం ఇస్తుంది.
మీనరాశి
బుధుడు మీన రాశి వ్యాపారులకు గొప్ప మంచి సమయాన్ని తీసుకురాబోతున్నాడు. స్థానిక కుండలిలోని బుధుడు కెరీర్ పరంగా మంచి ప్రభావాన్ని చూపగలడు. లాభం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి సమయం ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగి.. ఆనందం వస్తుంది.
సంబంధిత కథనం