హిందూ వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు 36-know imprtant rituals in hindu wedding ceremony in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Know Imprtant Rituals In Hindu Wedding Ceremony In Telugu

హిందూ వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు 36

HT Telugu Desk HT Telugu
Apr 17, 2023 10:23 AM IST

హిందూ వివాహంలో 36 ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

హిందూ వివాహ వేడుక
హిందూ వివాహ వేడుక (pexels)

హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు 36 ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మన సనాతన ధర్మంలో ప్రతీ మనిషికి వివాహం చాలా ముఖ్యమైనది. మానవుడు 4 ఆశ్రమాలలో మిగిలిన మూడు ఆశ్రమాలకు ఆధారము చూపగలుగుతాడు. ఇటువంటి వివాహ ప్రక్రియలో 36 ముఖ్యమైన ఘట్టాలున్నాయా.

ట్రెండింగ్ వార్తలు

వివాహ ప్రక్రియ పెళ్లిచూపులతో మొదలవుతుంది. పెళ్లిచూపులు, నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ, ఎదురు కోలు, గౌరీపూజ, మంగళస్నానాలు, కన్యావరణం, మధుపర్కాలు, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, కాళ్లుకడగటం వంటి ఘట్టాలు ఆరంభంలో ఉంటాయి.

సుముహూర్తం (జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచడం), చక్రపాదాలు, కన్యాదానం, సువర్ణజలాభి మంత్రం, యోక్త్ర బంధనం, మంగళసూత్ర ధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, గౌరీశంకర సంవాదం (అంగుళీయకాలు తీయడం), సప్తపది పాణిగ్రహణం, హెూమం, సన్నికల్లు తొక్కడం, లాజ హెూమం, స్థాళీపాకం, నాగవల్లి, సదస్యం, నల్లపూసలు కట్టడం, అరుంధతీ నక్షత్ర దర్శనం, ఉయ్యాలలోని బొమ్మను ఆడపడచుకు అప్పజెప్పడం, అంపకాలు కీలకమైనవి.

తరువాత గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, కంకణ విమోచనం, గర్భాదానం... ఈ ముప్ఫై ఆరూ వివాహ సంప్రదాయంలో జరిగే ముఖ్యమైన ఘట్టాలు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్