Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశికి వారికి ఈరోజు ప్రతీ పని లాభదాయకంగా సాగుతుంది!-horoscope today in telugu know your rasi phalalu for thursday february 2 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Know Your Rasi Phalalu For Thursday February 2, 2023

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశికి వారికి ఈరోజు ప్రతీ పని లాభదాయకంగా సాగుతుంది!

HT Telugu Desk HT Telugu
Feb 02, 2023 01:01 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ ఫిబ్రవరి 2, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (Unsplash)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలాలు) 02.02.2023

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: మాఘము వారం: గురువారం, తిథి: శు. ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర

మేష రాశి :

మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. మేష రాశి వారికి ఈ రోజు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పనులయందు చికాకులు, మాట పట్టింపులు ఏర్పడును. జన్మ స్థానము రాహువు ద్వితీయ స్థానమునందు కుజుని, ప్రభావంచేత మేషరాశివారు గోడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. భాగ్యములో బుధుడు, దశమంలో రవి ప్రభావము చేత ఆలోచించి తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలను కలుగచేస్తాయి. మేషరాశి వారికి లాభ స్థానమునందు శని శుక్రుల సంచారముచేత చేసే ప్రతీ పని అనుకూలించును. వ్యయస్థానమునందు గురుని ప్రభావంచేత ఖర్చులు అధికముగా ఉండును. మేష రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. స్త్రీలు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మేష రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కుజుడు, అష్టమ బుధుని ప్రభావంచేత వృషభరాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషం పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత కుటుంబము, స్నేహితులతో భేదాభిప్రాయములు వాగ్వివివాదములు ఏర్పడు సూచనలు కలుగుచున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత ఒత్తిళ్ళు వేదనలు అధికముగా ఉండును. వృషభరాశివారికి లాభమునందు గురుడు, దశమము నందు శని, శుక్రుల ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. దశమములో శని, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. వృషభ రాశి వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలించును స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించాలి

మిథున రాశి :

మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉంది. మిధున రాశి వారికి అష్టమ రవి, వ్యయస్థానమునందు కుజుని ప్రభావం చేత కుటుంబమునందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. భాగ్యమునందు శని శుక్రుల ప్రభావంచేత వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉండును. దశమములో గురుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. మిథున రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసిన సమయము. కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించెదరు. అష్టమ స్థానము శని సంచరించుట చేత కుటుంబము విషయాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి భాగ్యములో రాహువు, అష్టమ స్థానములో గురుని, ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ రోజు ఉద్యోగ వ్యాపారాలయందు అనుకూల ఫలితములు అధికముగా కనబడుచున్నవి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. స్త్రీలకు ఈ రోజు అనుకూలముగా ఉన్నది. సింహరాశి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించండి.

కన్య రాశి :

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. కన్యారాశికి భాగ్యమునందు కుజుడు, సప్తమ స్థానము నందు గురుడు, ఆరవ స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత ఈరోజు చేసే ప్రతీ పని అనుకూలించును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సమాజంలో కీర్తి కలుగును. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసేదరు. చతుర్థస్థానము నందు బుధులు అనుకూలించును. పంచమ ఆరవ స్థానమునందు శని, శుక్రుల ప్రభావంచేత మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ రోజు ఒత్తిళ్ళు తగ్గును. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి :

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శని శుక్రుల అనుకూల ప్రభావంచేత తులారాశివారు చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. శత్రు స్థానములో గురుడు, ఆయు స్థానములో కుజుని ప్రభావంచేత తులారాశి వారికి శత్రు వర్గము వలన ఇబ్బందుల, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన తులారాశివారు అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానము నందు రాహువు ప్రభావంచేత చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావం చేత, కళత్ర స్థానములో కుజుని ప్రభావంచ చేత కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వృశ్చికరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. ద్వితీయ స్థానమునందు బుధుడు, తృతీయమునందు రవి సంచారము వలన ధన లాభము కలుగును. పంచమ స్థానమునందు గురుని ప్రభావంచేత ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని ఆరాధించండి.

ధనుస్సు రాశి :

ధనూ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. జన్మరాశి యందు బుధుని సంచారముచేత వ్యాపారస్తలకు లాభములు, ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలత కలుగును. ధనూరాశి వారికి కుజ, గురు గ్రహాల అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ధనూరాశి వారికి ఈవారం ధనలాభము సౌఖ్యము కలుగు సూచన. ధనూ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించాలి.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలముగా లేదు. జన్మరాశి యందు రవి సంచారము చేత అనారోగ్య సమస్యలు అధికముగా మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని శుక్రుల ప్రభావంచేత (ఏలినాటి శని ప్రభావంచేత) ఖర్చులు అధికమగును. మకరరాశి వారు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వ్యయస్థానమునందు బుధుని ప్రభావం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి అధికముగా ఉన్నాయి. జన్మరాశి యందు శని, వ్యయస్థానమునందు రవి, చతుర్థ స్థానమునందు కుజుని ప్రభావం చేత ధనపరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉండును. కుంభరాశి వారు ఆర్ధిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక సమస్యలు ఏర్పడు సూచన. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ద్వితీయ స్థానమునందు గురుని వలన కుంభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు యందు మధ్యస్థ ఫలితాలు కలుగును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని వలన చేసే ప్రతీ పనియందు కొంత ఆటంకములు ఏర్పడు సూచన. ఈరోజు విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుంభ రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలముగా లేదు. ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి అధికముగా ఉన్నది. జన్మరాశి యందు గురుడు, ఏలినాటి శని ప్రభావం చేత మీన రాశి వారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనపరమైనటువంటి వ్యవహారాల యందు జాగ్రత్తలు పాటించాలి. దశమంలో రవి ప్రభావంచేత మీన రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో మధ్యస్థ ఫలితములు కలుగును. ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. జన్మరాశి యందు గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.