Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశికి వారికి కుటుంబంలో సమస్యలు పెరిగే సూచన!-horoscope today in telugu expect the unexpected astro prediction for friday february 3 2023 ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Expect The Unexpected, Astro Prediction For Friday February 3, 2023

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశికి వారికి కుటుంబంలో సమస్యలు పెరిగే సూచన!

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 01:01 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ ఫిబ్రవరి 3, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (Stock Photo)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.02.2023 సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: మాఘము వారం: శుక్రవారం, తిథి: శు. త్రయోదశి నక్షత్రం: పునర్వసు

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి :

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలముగా మధ్యస్థముగా ఉన్నది. జన్మ స్థానము రాహువు ద్వితీయ స్థానమునందు కుజుని ప్రభావం మేషరాశివారు గోడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. భాగ్యములో రవి బుధులు, దశమంలో శని శుక్రుల సంచారము వలన మేషరాశివారికి ఈవారం మధ్యస్థ ఫలితాలు కనబడుచున్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం, ఆవునేతితో దీపాన్ని వెలిగించడం శుభఫలితాలను కలిగిస్తాయి.

వృషభ రాశి :

వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కుజుడు, వ్యయ స్థానము రాహువు, అష్టమస్థానము రవి, బుధుల ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. కుజుని ప్రభావంచేత ఒత్తిళ్ళు వేదనలు అధికముగా ఉండును. మనస్తాపము, అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. వృషభ రాశి వారికి లాభమునందు గురుడు, భాగ్యము నందు శని శుక్రుల అనుకూల ప్రభావం వలన ఉద్యోగ వ్యాపారములయందు కలసి వచ్చును. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. బృహస్పతి అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు. వృషభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభములు కలుగును.

మిథున రాశి :

మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉంది. మిథున రాశి వారికి ఏడవ స్థానమునందు రవి, అష్టమ శని ప్రభావం చేత కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు ఏర్పడును. మిథున రాశి వారికి వ్యయస్థానము యందు కుజుని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. అష్టమ శని ప్రభావంచేత పనులయందు చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. బుధ, గురుల అనుకూలత వలన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మిథున రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ సహస్రనామాన్ని పఠించండి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. లాభములో కుజుని ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. కళత్ర స్థానము శని సంచరించుట వలన కుటుంబము విషయాలలో జాగ్రత్తలు వహించాలి. గురు, కుజ రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ రోజు కలిసి వచ్చును. కుటుంబ విషయాలయందు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్య విషయాల యందు, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్దిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ వారం రోజు మీకు మధ్యస్థముగా ఉన్నది. సింహరాశి వారికి చతుర్థంలో కేతువు, అష్టమ స్థానములో గురుని ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు ఉ ద్యోగ వ్యాపారాలయందు మధ్యస్థ ఫలితములు అధికముగా కనబడుచున్నవి. శని శుక్రుల అనుకూల ప్రభావం చేత సింహరాశి వారు మీ సమస్యలను నేర్పుతో అధిగమించెదరు. అష్టమ గురుని ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. కుజుని అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. సింహరాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కన్య రాశి :

కన్యారాశి వారికి ఈ రోజుం మీకు అనుకూలంగా ఉన్నది. ద్వితీయ స్థానమునందు కేతువు ప్రభావంచేత మనస్పర్థలు ఏర్పడును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన విజయం పొందెదరు. చతుర్థస్థానము నందు రవి, బుధులు అనుకూలించును. పంచమ స్థానమునందు శని, శుక్రుల ప్రభావంచేత మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ వారం ఒత్తిళ్ళు తగ్గును. శని,గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందెదరు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యారాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులా రాశి :

తులారాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కేతువు, అష్టమ కుజుడు, అర్ధాష్టమ శని ప్రభావంచేత చేసే ప్రతీ పనియందు చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారములందు, కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని ఈ రోజు ఆవునేతితో దీపాన్ని వెలిగించి పఠించడం మంచిది.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ద్వితీయ స్థానమునందు రవి, బుధుల సంచారము వలన ధన లాభము, వస్తులాభము కలుగును. తృతీయ స్థానమునందు శని శుక్రుల సంచారముచేత చేసే ప్రతీ పనియందు విజయాన్ని పొందెదరు. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ధనుస్సు రాశి :

ధనూ రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. జన్మరాశి యందు రవి బుధుల సంచారముచేత ఒత్తిడులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ధనూరాశి వారికి కుజ, గురు గ్రహాల అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి శని ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ధనూ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహరాలయందు మకరరాశివారు జాగ్రత్త వహించాలి. వ్యయస్థానమునందు రవి, బుధుల ప్రభావం చేత ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని వలన పనులయందు ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడును. ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం అలాగే ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలున్నాయి. ఏలినాటి శని, వ్యయస్థానములో శుక్రుని సంచారము వలన కుంభరాశివారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు పెరుగును. దశమ స్థానములో రవి, బుధుల ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నములు కలసివచ్చును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ద్వితీయ స్థానమునందు గురుని వలన కుంభరాశివారికి కుటుంబ వ్యవహారాలు అనుకూలించును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని వలన చేసే ప్రతీ పనియందు కొంత ఆటంకములు ఏర్పడు సూచన. మనో వికారములు ఏర్పడును. ఈరోజు విద్యార్థులకు కలసి వచ్చును. కుంభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. లాభస్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత మీనరాశి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. దశమంలో రవి, బుధుల అనుకూల స్థితి వలన మీనరాశి వారికి ఆర్ధిక లాభములు వ్యాపార లాభము కలుగును. ఉద్యోగస్తులకు కలసివచ్చే సమయ. మీనరాశి వారికి జన్మరాశియందు గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. దశమ స్థానమునందు రవి, బుధుల ప్రభావం చేత ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కలసి వచ్చును. కీర్తి, సౌఖ్యము కలుగును. గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించవలన శుభ ఫలితము కలుగును.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం