Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు స్త్రీ సౌఖ్యం, కానీ జాగ్రత్త!-horoscope today in telugu check love predictions for november 29 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today In Telugu, Check Love Predictions For November 29, 2022

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు స్త్రీ సౌఖ్యం, కానీ జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 05:05 AM IST

Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ నవంబర్ 29, 2022కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (Stock Photo)

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలాలు) 29.11.2022 సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: మార్గశిరము వారం: మంగళవారం, తిథి: శు. షష్ఠి నక్షత్రం: శ్రవణం

మేష రాశి :

మేష రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ఆయు స్థానమునందు రవి, బుధ, శుక్రులు, కళత్ర స్థానమునందు కేతువు ప్రభావం చేత కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు అధికమగును. జన్మ రాహువు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత ఘర్షణలు, మానసిక వేదన అధికముగా ఉండును. వ్యయస్థానమునందు గురుని ప్రభావంచేత ఖర్చులు అధికమగును. మేష రాశి వారు ఈ వారం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొంత అధికమగును. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది అని తెలియచేస్తున్నాము. మేషరాశివారు ఈ రోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.

వృషభ రాశి :

వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్తము నుండి అనుకూలంగా ఉన్నది. జన్మరాశి యందు కుజుడు, వ్యయ స్థానము రాహువు, భాగ్యస్థానమునందు శని ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానమునందు రవి, బుధ, శుక్రుల ప్రభావంచేత కుటుంబమునందు వాదనలు, సమస్యలతో కూడినటువంటి వాతావరణం ఉండును. మనస్తాపము , అనారోగ్యం కలుగు సూచనలున్నాయి. వృషభరాశి వారికి మానసిక ఒత్తిళ్ళు అధికమగు సూచనలు. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. బృహస్పతి అనుకూలం ప్రభావంచేత ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం పొందెదరు. వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించాలి.

మిథున రాశి :

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి వ్యయస్థానము యందు కుజుని ప్రభావంచేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. పనులయందు చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. రవి, బుధ, శుక్రుల అనుకూలత వలన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. మిథున రాశి వారికి ధన లాభము కలుగును. అష్టమశని ప్రభావంచేత ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. మరిన్ని శుభ ఫలితాల కోసం మిథున రాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించాలి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. లాభములో కుజుని ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేసెదరు. ఈ వారం మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. చతుర్ధ స్థానమునందు కేతువు సంచారము వలన స్త్రీలతో జాగ్రత్త వహించాలి. శని వక్రియై సంచరించుట వలన కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించును. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి. దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తం నుండి అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య విషయం ప్రక్కన పెడితే ఈ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుచున్నవి. అష్టమ గురుని ప్రభావంచేత సింహరాశి ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. కుజుని అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. సింహరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఆదివారం సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్య రాశి :

కన్య రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. తృతీయంలో రవి, బుధ, శుక్రుల అనుకూల స్థితి వలన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కన్యారాశి వారికి ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఒత్తిళ్ళు తగ్గును. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యా రాశి వారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

తులా రాశి :

తులా రాశి వారికి ఈ రోజు మధ్యస్త ఫలితాలున్నాయి. ఒత్తిళ్ళు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీ సౌఖ్యము కలుగును. పనుల యందు శ్రమ అధికముగా ఉండును. జన్మ కేతువు అష్టమ కుజుడు, సప్తమ రాహువు ప్రభావం వలన కుటుంబమునందు ఉద్యోగ వ్యాపారమునందు చికాకులు కలుగును. శత్రు స్థానము నందు గురుని ప్రభావం చేత విరోధులతో జాగ్రత్తలు వహించడం మంచిది. అర్ధాష్టమ శని ప్రభావంచేత కొంత కాలము కుటుంబ వ్యవహారాలయందు, ఉద్యోగ వ్యాపారముల యందు ఓర్పుతో ఆచితూచి వ్యవహరించాలని సూచన. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అప్పుల ఒత్తిడి ఉండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారికి ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశికి ఈ రోజు అంత అనుకూలముగా లేదు. జన్మరాశి రవి, బుధ, శుక్రుల ప్రభావంచేత శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికమగును. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో వాగ్వివివాదాలు కనబడు సూచనలు ఉన్నాయి. అయినప్పటికి వృశ్చిక రాశి వారికి శని, గురుల అనుకూల ప్రభావంచేత మీ సమస్యలను అధిగమించి ముందుకు సాగెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ధనలాభము కలుగును. వృశ్చిక రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. ధనురాశి వారికి చేసే ప్రతీ పని అనుకూలించును. వ్యయ స్థానము నందు రవి, బుధ, శుక్రుల ప్రభావంచేత ఖర్చులు అధికమగును. కుటుంబ వ్యవహారాల యందు ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించాలి.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉన్నది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. లాభ స్థానములో రవి, బుధ, శు క్రుల ప్రభావంచేత చేసే ప్రతీ పని అనుకూలించును. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ధనలాభము, సౌఖ్యము కలుగును. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ రోజు పూజించాలి.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. దశమ స్థానములో రవి, బుధ, శుక్రుల ప్రభావంచేత ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈ వారం కలసి వచ్చును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని ప్రభావం ఉ న్నప్పటికి ఈ వారం గోచర స్థితి వలన శుభఫలితాలు కనబడుతున్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్యము అనుకూలించును. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి ఈ వారం దశమ స్థానములో ఉన్న గ్రహాల అనుకూల స్థితి వలన మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారములో ఉన్న సమస్యలు తొలగును. స్త్రీలకు ఈరోజు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు కలసి వచ్చును. కుంభరాశి వారు ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. కుటుంబమునందు సమస్యలు వేధించును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. భాగ్య స్థానమునందు రవి, బుధ, శుక్రుల ప్రభావం చేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. కీర్తి , సౌఖ్యము కలుగును. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

WhatsApp channel

టాపిక్