Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు ఆరోగ్య, కుటుంబ వ్యవహరాల్లో జాగ్రత్త వహించాలి..-daily horoscope in telugu check astrological predictions for 27th january 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Daily Horoscope In Telugu Check Astrological Predictions For 27th January 2023

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు ఆరోగ్య, కుటుంబ వ్యవహరాల్లో జాగ్రత్త వహించాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 27, 2023 01:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? జనవరి 27వ తేదీ 2023న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (27-01-2023) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు మేషరాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం, ఆవునేతితో దీపాన్ని వెలిగించడం శుభఫలితాలను కలిగిస్తాయి.

ఈరోజు వృషభరాశి ఫలాలు

వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఒత్తిడి, వేదనలు అధికముగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారములయందు కలసి వచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మీ శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభములు కలుగును.

ఈరోజు మిధునరాశి ఫలాలు

మిథునరాశివారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిడి, సమస్యలు ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ సహస్రనామాన్ని పఠించండి.

ఈరోజు కర్కాటకరాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థము నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి. మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్దిక విషయాలు అనుకూలిస్తాయి. శుభ ఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.

ఈరోజు సింహరాశి ఫలాలు

సింహరాశి వారికి మధ్యస్థముగా ఉన్నది. ఆరోగ్యపరమైన, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో మధ్యస్థ ఫలితములు అధికముగా ఉన్నాయి. సమస్యలను నేర్పుతో అధిగమిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

ఈరోజు కన్యారాశి ఫలాలు

కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. మనస్పర్థలు ఏర్పడును. అయినప్పటికీ విజయం పొందెదరు. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఒత్తిడి తగ్గును. చేసే ప్రతీ పనిలో విజయం పొందుతారు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

ఈరోజు తులా రాశి ఫలాలు

తులారాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. చేసే ప్రతీ పనిలో చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబంలో ఏదో ఒక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిడి అధికమగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని ఈ రోజు ఆవునేతితో దీపాన్ని వెలిగించి పఠించడం మంచిది.

ఈరోజు వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చికరాశికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధన లాభము, వస్తులాభము కలుగును. చేసే ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉంటుంది. కానీ అనుకున్న పనిని పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ఈరోజు ధనూ రాశి ఫలాలు

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఒత్తిడులు అధికముగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. చేసే పనుల్లో విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య, కుటుంబ వ్యవహరాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికమగును. వాటిని నియంత్రించుకోవాలి. పనుల్లో ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడును. ఆచితూచి వ్యవహరించవలసిన సమయం. రాజకీయ ఒత్తిడి అధికముగా ఉండును. కొంత చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం అలాగే ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

ఈరోజు కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలున్నాయి. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు పెరుగును. ఉద్యోగస్తులకు ప్రయత్నములు కలసివచ్చును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. కుటుంబ వ్యవహారాలు అనుకూలించును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ముందుకు సాగుతారు. చేసే ప్రతీ పనిలో కొంత ఆటంకములు ఏర్పడును. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

ఈరోజు మీన రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్ధిక, వ్యాపార లాభము కలుగును. ఉద్యోగస్తులకు కలసివచ్చే సమయం. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి. అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వచ్చును. శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించవలన శుభ ఫలితము కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్