Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుంభరాశివారిపై తీవ్రంగా ఉన్న శనిప్రభావం.. జాగ్రత్తగా ఉండాలి..-daily horoscope in telugu check astrological predictions for 1st february 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Daily Horoscope In Telugu Check Astrological Predictions For 1st February 2023

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : కుంభరాశివారిపై తీవ్రంగా ఉన్న శనిప్రభావం.. జాగ్రత్తగా ఉండాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Feb 01, 2023 01:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? ఫిబ్రవరి 1వ తేదీ 2023న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (01-02-2023) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు మేషరాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు. శారీరక ఒత్తిడి అధికమగును. వాగ్వివివాదానికి దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కొంత కలిగే సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు వృషభరాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఖర్చులు అధికమగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు మిధునరాశి ఫలాలు

ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము కలుగును. మీ కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందెదరు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణాల్లో ఖర్చులు అధికమగును. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు కర్కాటకరాశి ఫలాలు

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

ఈరోజు సింహరాశి ఫలాలు

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు కన్యారాశి ఫలాలు

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చంద్రుని ప్రభావం చేత శారీర శ్రమ, మానసిక ఒత్తిడి పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉండును. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కన్యారాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు తులా రాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వారు మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు వృశ్చిక రాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ అధికముగా ఉండును. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. శత్రువులు జాగ్రత్త వహించాలి. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు ధనూ రాశి ఫలాలు

ఈరోజు మీకు మద్యస్తమునుంచి అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈరోజు మకర రాశి ఫలాలు

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. చికాకులు అధికముగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ఈరోజు కుంభ రాశి ఫలాలు

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

ఈ రోజు మీన రాశి ఫలాలు

ఈ రోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితములున్నాయి. కుటుంబ సౌఖ్యము కలుగును. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఆందోళన కలుగును. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్