Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.. జాగ్రత్త-daily horoscope in telugu check astrological predictions for 29th january 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.. జాగ్రత్త

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.. జాగ్రత్త

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 29, 2023 01:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? జనవరి 29వ తేదీ 2023న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (29-01-2023) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు మేషరాశి ఫలాలు

మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు. స్త్రీలకు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మరిన్ని శుభఫలితాలు పొందడం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది.

ఈరోజు వృషభరాశి ఫలాలు

వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తలు వహించండి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఒత్తిడి, వేదనలు అధికముగా ఉండును. మనస్తాపము, అనారోగ్యం కలుగును. ఉద్యోగ, వ్యాపారములయందు కలసి వచ్చును. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ.. శ్రమతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజించడం మంచిది.

ఈరోజు మిధునరాశి ఫలాలు

మిధునరాశివారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఒత్తిడి, సమస్యలు ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడును. శారీరక శ్రమ పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సమస్యలను, ఒత్తిళ్లను నేర్పుతో అధిగమిస్తారు. ఆదిత్య హృదయాన్ని పఠించండి.

ఈరోజు కర్కాటకరాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థము నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. కుటుంబము విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య, ఆర్ధిక వ్యవహారాల యందు జాగ్రత్త వహించడం మంచిది. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి.

ఈరోజు సింహరాశి ఫలాలు

సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో మధ్యస్థ ఫలితములు అధికముగా ఉంటాయి. మీ సమస్యలను నేర్పుతో అధిగమిస్తారు. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించడం మంచిది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగును. ఆదివారం సూర్యాష్టకము పఠిస్తే శుభఫలితాలు కలుగును.

ఈరోజు కన్యారాశి ఫలాలు

కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కానీ మనస్పర్థలు ఏర్పడును. అయినప్పటికి విజయం పొందెదరు. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఒత్తిడి తగ్గును. చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి.

ఈరోజు తులా రాశి ఫలాలు

తులారాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. చేసే ప్రతీ పనిలో చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబమునందు ఏదో ఒక సమస్య బాధించును. వ్యాపారస్తులకు ఒత్తిడి అధికమగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

ఈరోజు వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చికరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ధన లాభము, వస్తులాభము కలుగును. చేసే ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. కుటుంబముతో ఆహ్లాదముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

ఈరోజు ధనూ రాశి ఫలాలు

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఒత్తిడులు అధికముగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. చేసే పనుల్లో విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు ఇది. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఏలినాటి శని ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

ఈరోజు మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య, కుటుంబ వ్యవహరాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలి. పనుల్లో ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడును. ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

ఈరోజు కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలున్నాయి. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అప్పులు పెరుగును. ఉద్యోగ ప్రయత్నములు కలసివచ్చును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. కుటుంబ వ్యవహారాలు అనుకూలించును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ ఏదో రకంగా ముందుకు సాగుతారు. చేసే ప్రతీ పనిలో కొంత ఆటంకములు ఏర్పడును. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాష్టకం చదవండి.

ఈరోజు మీన రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్ధిక, వ్యాపార లాభములు కలుగును. ఉద్యోగస్తులకు కలసివచ్చే సమయం. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచన. అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వచ్చును. కీర్తి, సౌఖ్యము కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్